Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: పింక్ లో మిల్కీ .. క‌న్నార్పితే ఒట్టు

By:  Tupaki Desk   |   21 Dec 2020 1:40 PM IST
ఫోటో స్టోరి: పింక్ లో మిల్కీ .. క‌న్నార్పితే ఒట్టు
X
మిల్కీ వైట్ సోయ‌గం త‌మ‌న్నా పింక్ లుక్ సంథింగ్ స్పెష‌ల్ గా వైర‌ల్ అవుతోంది. అయితే త‌మ‌న్నా ఎక్క‌డి నుంచి వ‌స్తోంది? అంటే నేడు త‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా కొలీగ్స్ తో పార్టీ ముగించి అటుపై విమానాశ్ర‌యం నుంచి ఇలా బ‌య‌ట‌ప‌డుతోందనేది ఓ గుస‌గుస‌. పింక్ స్క‌ర్ట్ లో మిల్కీ నెవ్వ‌ర్ బిఫోర్ హాట్ నెస్ తో వేడి పెంచేస్తోంది. ఇక నేడు త‌మ‌న్నా బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఓసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే...

మిల్కీవైట్ బ్యూటీ తమన్నా ద‌శాబ్ధం కెరీర్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. అన్ని ఒడిదుడుకుల‌ను ఎదురొడ్డి కెరీర్ ప‌రంగా పీక్స్ అంటే ఏమిటో చూసిన నాయిక‌గా త‌మ‌న్నా హ‌వా మెచ్చ‌ద‌గిన‌ది.

21 డిసెంబ‌ర్ 1986 లో జన్మించిన తమన్నా తెలుగు-త‌మిళం-హిందీ ప‌రిశ్ర‌మ‌ల్లో కెరీర్ ని సాగిస్తోంది. ముంబై గాళ్ గా మిల్కీ అక్క‌డే తన ప్రారంభ విద్యను ప్రారంభించింది. కెరీర్ ఆరంభం ఫాంటా- చంద్రికా సబ్బులకు మోడల్ ‌గా ప‌ని చేసింది. అటుపై తమన్నా 2005 లో హిందీ చిత్రం చాంద్ సా రోషన్ చిత్రంలో న‌టించింది. ఆ తరువాత సౌత్ లోని చాలా విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించింది. తెలుగులో శ్రీ అనే చిత్రంతో రంగ ప్ర‌వేశం చేసినా హ్యాపీడేస్ తో గుర్తింపు ద‌క్కింది.

బాలీవుడ్ లో హిమ్మ‌త్ వాలా .. సాజిద్ ఖాన్ హమ్ ష‌కల్స్ మరో చిత్రంలో కూడా నటించింది. అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరో స‌ర‌స‌న న‌టించింది. తమిళ చిత్రం `చారులత`లో న‌ట‌న‌కు ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకుంది. దీనితో పాటు `నాచ్ బలియే 5` లో కూడా కనిపించింది. ఇందులో తన డ్యాన్స్ ప్రతిభను కూడా చూపించింది. పాన్ ఇండియా మూవీ `బాహుబలి` లో న‌టించింది. నేడు త‌మ‌న్నా బ‌ర్త్ డే సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు.