Begin typing your search above and press return to search.

సమంత.. తమన్నా ఫస్ట్‌ మీటింగ్‌ ఇంట్రెస్టింగ్‌ స్టోరీ

By:  Tupaki Desk   |   14 Dec 2020 8:56 AM IST
సమంత.. తమన్నా ఫస్ట్‌ మీటింగ్‌ ఇంట్రెస్టింగ్‌ స్టోరీ
X
టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత హోస్ట్‌ గా వ్యవహరిస్తున్న 'సామ్‌ జామ్‌' టాక్‌ షో కు తమన్నా గెస్ట్‌ గా వచ్చారు. సౌత్‌ ఇండియాలో స్టార్‌ హీరోయిన్స్‌ గా గత దశాబ్ద కాలంగా కంటిన్యూ అవుతున్న వీరిద్దరు ఒక్క వేదికపై రావడం.. అది కూడా టాక్‌ షో అవ్వడంతో అభిమానులు ఆశ్చర్యంతో ఎగిరి గంతేసినంత పని చేశారు. వీరిద్దరి టాక్‌ షోకు సంబంధించి ప్రోమో విడుదల అవ్వగానే చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు షో ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతుంది. వీరిద్దరి ముచ్చట్లు సరదాగా సాగాయి. సినిమాలు.. వ్యక్తిగతం.. కోవిడ్‌ ఇలా అన్ని విషయాల గురించి వీరు మాట్లాడుకుంటూ వచ్చారు. సినిమాల్లో ఎంట్రీ గురించి ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు.

ఇక ఇద్దరు మొదటి సారి ఎక్కడ కలిశారు అనే విషయమై సమంత చాలా ఇంట్రెస్టింగ్‌ స్టోరీ చెప్పింది. ఏమాయ చేశావే సినిమా తర్వాత నన్ను ఒక సినిమా వేడుకకు తీసుకు వెళ్లారు. అక్కడ మొదటి సారి సినిమా పరిశ్రమకు చెందిన పలువురిని చూశాను. అక్కడ నేను తమన్నాను చూశాను. నేను చూసిన మొదటి సినిమా హీరోయిన్‌ తమన్నానే. ఆరోజు ఆమెను చూసిన సమయంలో వావ్‌ ఎంత అందంగా ఉంది అనుకున్నాను అంటూ తమ ఫస్ట్‌ మీటింగ్ గురించి చెప్పుకొచ్చింది.

ఇక పెళ్లి తర్వాత సినిమాలు రావు అనే అనుకున్నాను. రాకున్నా పర్వాలేదు అనుకుని పెళ్లికి సిద్దం అయ్యాను. కాని అదృష్టం బాగుంది పెళ్లి తర్వాత కూడా బిజీగా ఉన్నాను అంటూ సమంత తన ఆందాన్ని తమన్నాతో షేర్‌ చేసుకుంది. వీరిద్దరి మాట ముచ్చటలు సరదా సరదాగా సాగిపోయాయి. వీరి మాటల మద్యలో దర్శకురాలు నందిని రెడ్డి కూడా వచ్చి జాయిన్‌ అయ్యారు. ఆమె వీరితో సినిమా చేస్తానంటూ సరదాగా కొద్ది సమయం హడావుడి చేసింది.