Begin typing your search above and press return to search.

తరగని అందాల నిధి తమన్నా

By:  Tupaki Desk   |   29 March 2021 9:00 AM IST
తరగని అందాల నిధి తమన్నా
X
తెలుగు తెరకి నాజూకు సౌందర్యాన్ని పరిచయం చేసిన అతి తక్కువమంది కథానాయికలలో తమన్నా ఒకరు. చిన్న సినిమాలతో కెరియర్ ను ఆరంభించి తారాజువ్వలా దూసుకుపోయిన అరుదైన కథానాయికలలో కూడా ఆమె ఒకరుగా చెప్పుకోవచ్చు. గులాబీ గుత్తిలాంటి తమన్నాను తెరపై తొలిసారిగా చూసిన ప్రేక్షకులు .. ఇంత కలర్ ను ఇంతవరకూ చూడలేదని అనుకున్నారు. దారితప్పిన దేవకన్యనా? అసలైన అందం కోసం కుర్రాళ్లు చేస్తున్న అన్వేషణకు ఫుల్ స్టాప్ పెట్టడం కోసం వచ్చిన వనదేవతనా? అని అనుకున్నారు. తొలిసారి ఆమెను స్క్రీన్ పై చూసి థియేటర్లలోనే పడుచు మనసులను పారేసుకున్న వాళ్లు ఎందరో!

తమన్నా తన కెరియర్ ను మొదలుపెట్టేసి 15 ఏళ్లు గడిచిపోయాయి. ఈ కాలంలో హీరోయిన్స్ పట్టుమని ఓ పది సినిమాలు చేస్తే గొప్ప విషయం. అలాంటిది తమన్నా సుదీర్ఘమైన ఈ ప్రయాణంలో స్టార్ హీరోలందరి జోడీగా దుమ్మురేపేసింది. తెలుగుతో పాటు తమిళ .. కన్నడ .. హిందీ భాషల్లో అందానికి అద్దం పట్టింది .. అందమైన అభినయానికి అర్థం చెప్పింది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు తెలుగు సినిమాలు ఉన్నాయి. వాటిలో 'ఎఫ్ 3' ప్రాజెక్టుపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఒక వైపున తన సినిమాలను చక్కబెడుతూనే, సోషల్ మీడియాలోను తమన్నా చురుకుగా ఉంది. తన లేటెస్ట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ, అభిమానులకు ఉత్సాహాన్ని పంచేస్తోంది .. ఉత్తేజాన్ని పెంచేస్తోంది. తాజాగా వదిలిన ఫొటోలో తమన్నా పింక్ కలర్ డ్రెస్ లో పింక్ డైమండ్ లా మెరుస్తోంది. కరిగిపోని స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ లా కనువిందు చేస్తోంది. కాస్త వెన్నకి .. ఇంకాస్త జున్ను కలిపి, కొద్దిగా యాపిల్ ముక్కలు మిక్స్ చేసి తయారు చేసినట్టుగా అనిపిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్ రేటులా ఈ అమ్మడి అందం పెరుగుతుండటం విచిత్రం. పాలతరకలా .. పూతరేకులా ఊరించే ఈ పలచని అందాలను ఆరాధించని నయనాలెందుకూ? ఆశగా ఆస్వాదించని హృదయాలెందుకూ? అనిపించడం లేదూ!