Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : పాలరాతి శిల్పంలా ఎంతటి అందం

By:  Tupaki Desk   |   5 Aug 2021 10:34 AM GMT
ఫొటోటాక్ : పాలరాతి శిల్పంలా ఎంతటి అందం
X
అందం అనగానే పాల రాతి శిల్పాలు ఎక్కువగా గుర్తుకు వస్తూ ఉంటాయి. చాలా మంది చాలా రకాలుగా అందాలను కొలుస్తూ ఉంటారు. కాని ఈ ఫొటోను చూస్తుంటే అందం అంటే ఇదే కదా అన్నట్లుగా ఉంది. తమన్నా మిల్కీ బ్యూటీ అనే పేరుకు నూటికి నూరుపాళ్లు న్యాయం చేసే వధంగా ఉంది అన్నట్లుగా పాలరాతి శిల్పం లా ఈమె ఉంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ఫిజిక్ మరియు ఔట్‌ ఫిట్‌.. ఫొటోకు ఫోజు ఇచ్చే విధానం ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్‌ గా సెట్‌ అయిన ఈ ఫొటో ను ఎంత సమయం చూసినా కూడా అలాగే చూడాలని అనిపించేలా ఉంది.

మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయినా కూడా ఇప్పటి వరకు ఆమె ఫిజిక్ లో కాని అందంలో కాని గ్లో కాని ఏమాత్రం మార్పు రాలేదు. పైగా అందం పెరుగుతుందని అభిమానులు అనుకునేలా తయారు అవుతోంది. పదేళ్ల పాటు టాలీవుడ్‌ లో టాప్ స్టార్‌ హీరోయిన్‌ గా కొనసాగిన ఈమె ప్రస్తుతం నెట్టింట వరుసగా తన హాట్ ఫొటోలను షేర్‌ చేస్తూ వచ్చింది. తాజాగా ఈమె షేర్‌ చేసిన ఈ ఫొటోకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. సన్నని నడుముతో పాటు ఆకట్టుకునే ఫిజిక్‌ తో వావ్‌ అనిపించేలా ఉంది.

ప్రస్తుతం హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేయడంతో పాటు వెబ్‌ సిరీస్ లను కూడా ఈమె చేస్తోంది. ఇప్పటికే రెండు వెబ్ సిరీస్ లను ఈమె చేసింది. త్వరలో హిందీలో ఒక వెబ్‌ సిరీస్ ను ఈమె చేసేందుకు సిద్దం అవుతోంది. సినిమాలు.. వెబ్‌ సిరీస్ లు.. ఐటెం సాంగ్ లతో పాటు తాజాగా టీవీ షో ను కూడా చేసేందుకు సిద్దం అయ్యింది. జెమిని టీవీలో కుకింగ్‌ విత్‌ టాక్ షో ను మొదలు పెట్టింది. ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. మొత్తానికి కెరీర్‌ ప్రారంభం అయ్యి ఇన్నాళ్లు అయినా కూడా బిజీగానే ఉండటం ఈమెకే చెల్లింది.