Begin typing your search above and press return to search.

పవర్ స్టార్ తో మిల్కీ కొత్త యాడ్

By:  Tupaki Desk   |   28 Feb 2018 9:44 PM IST
పవర్ స్టార్ తో మిల్కీ కొత్త యాడ్
X
మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మధ్య కాలంలో సినిమాలతో కంటే టీవీ లో యాడ్స్ వల్ల కూడా ఎక్కువ సంపాదించేద్దాం అని ప్లాన్స్ వేస్తోంది. ఈమధ్యనే కన్నడ లో ఒక యాడ్ చేసింది. ఆ యాడ్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. అంతగా ఈ భామ ఎం చేసిందా అనుకుంటున్నారా?

ఏమి చేయలేదండి. కన్నడ లో ఒక కొత్త యాడ్ లో ఈమె కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తో కలిసి నటించింది. ఈ యాడ్ తాలూకు కొన్ని ఫోటో లలో ఈమె ఒక దేవకన్య లాగా అందంగా కనిపిస్తోంది. పట్టు చీర కట్టుకుని, తలపై ఓని కప్పుకుని, ఒళ్ళంతా నగలతో దగా దగా మెరిసిపోతోంది. పక్కనే పునీత్ రాజ్ కుమార్ కూడా షేర్వాని లో నవ్వుతూ నిలబడ్డాడు. అయితే బాహుబలి ఒక పీరియాడిక్ చిత్రం అయినప్పటికీ ఒక యుద్ధ నారిలా మాత్రమే తమన్నా మనకు దర్శనమిచ్చింది. ఎదో క్లైమాక్స్ లో ఒక రెండు మూడు సెకండ్లు మహారాణి లా కనిపించినప్పటికి ఫాన్స్ మాత్రం కొంత నిరాశ చెందారని చెప్పచ్చు. అందుకోసమే ఈ యాడ్ అన్నట్టు తమన్నా తన కొత్త లుక్ తో అందరి లుక్స్ ని తన వైపు తిప్పేసుకుంటోంది.

యాడ్ లొనే కెమిస్ట్రీ ఆదరగొట్టేసిన వీళ్ళు నిజంగానే సినిమా చేస్తే అదుర్స్ అని ముందే జాతకం చెప్పేస్తున్నారు ఫాన్స్. ప్రస్తుతం క్వీన్ సినిమా రీమేక్ లో నటిస్తున్నా ఈమె కళ్యాణ్ రామ్ తో చేసిన 'నా నువ్వే' సినిమా ప్రేక్షకుల ముందుకు త్వరలో రానుంది. ఆ తరువాత సందీప్ కిషన్ తో కునాల్ కొహ్లీ డైరక్షన్లో చేసిన సినిమా రాబోతుంది.