Begin typing your search above and press return to search.

మెగా హీరోతో మిల్క్ బ్యూటీ స‌య్యాట‌

By:  Tupaki Desk   |   12 Jan 2022 9:30 AM GMT
మెగా హీరోతో మిల్క్ బ్యూటీ స‌య్యాట‌
X
స్పెష‌ల్ సాంగ్ ల హీరోయిన్ ల జాబితా తీస్తే అందులో ప్ర‌ధానంగా వినిపించే పేరు మిల్క్ బ్యూటీ త‌మ‌న్నా. బెల్లంకొండ శ్రీ‌నివాస్ హీరోగా న‌టించిన `అల్లుడు శ్రీ‌ను` సినిమాతో ఐట‌మ్ గాళ్ గా మారిన త‌మ‌న్నా ఇప్ప‌టి వ‌ర‌కు త‌న కెరీర్ లో ఏడు ప్ర‌త్యేక గీతాల్లో న‌టించిన హీరోయిన్ గా రికార్డు సాధించింది. ఈ త‌ర‌హాలో ఇంత వ‌ర‌కు ఏ స్టార్ హీరోయిన్ చేయ‌లేదు. ఐట‌మ్ సాంగ్ ల‌కు ఒక విధంగా చెప్పాలంటే మిల్కీ బ్యూటీ కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచింది.

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన `స‌రిలేరు నీకెవ్వ‌రు` మూవీ కోసం `డాంగ్ డాంగ్ .. అంటూ స్పెష‌ల్ సాంగ్ లో మెరిసిన త‌మ‌న్నా తాజాగా మ‌రో ఐట‌మ్ సాంగ్ కి రెడీ అయిపోయింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో క‌లిసి మాస్ట్ స్టెప్పులతో మెస్మ‌రైజ్ చేయ‌బోతోంది. వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టిస్తున్న చిత్రం `గ‌ని`. ఈ మూవీ ద్వారా సాయి కొర్ర‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. బాక్సింగ్ డ్రామా నేప‌థ్యంలో రూపొందుతున్నచిత్ర‌మిది.

ఈ మూవీతో స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ నిర్మాత‌గా మారుతున్నారు. అల్లు బాబీ కంప‌నీ, రినైసెన్స్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్ పై సిద్ధు ముద్దాతో క‌లిసి అల్లు బాబీ ఈ మూవీని నిర్మిస్తున్నారు. వ‌రుణ్ తేజ్ బాక్స‌ర్ గా న‌టిస్తున్న ఈ మూవీలో మిల్క్ బ్యూటీ త‌మ‌న్నా ప్ర‌త్యేక గీతంలో న‌టిస్తోంది. ఇందుకు సంబంధించిన పాట‌ని ఈ నెల 15న చిత్ర బృందం రిలీజ్ చేస్తున్న‌ట్టుగా బుధ‌వారం ప్ర‌క‌టించింది.

ఇటీవ‌ల `గ‌ని` అంథెమ్‌ని విడుద‌ల చేసిన మేక‌ర్స్ త‌మ‌న్నాపై చిత్రీక‌రించిన `కొడ్తే...` అంటూ సాగే ప్ర‌త్యేక గీతాన్ని విడుద‌ల చేస్తున్నారు. ఈ పాట‌లో త‌మ‌న్నా మెరున్ క‌ల‌ర్ డ్రెస్ లో హాట్ గా క‌నిపిస్తూ క‌నువిందు చేయ‌బోతోంది. ఈ పాట సినిమాకు హైలైట్ గా నిల‌వ‌నుంద‌ట‌. ఈ పాట‌లో వ‌రుణ్‌ తేజ్ కూడా త‌మ‌న్నాతో క‌లిసి స్టెప్స్ వేయ‌బోతున్నాడు. బాలీవుడ్ బ్యూటీ సయీ ముఖ‌ర్జీ ఇందులో హీరోయిన్ గా న‌టిస్తోంది.

స‌రికొత్త బాక్సింగ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ మార్చి 18న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రంలోని కీల‌క పాత్ర‌ల్లో క‌న్న‌డ స్టార్ హీరో ఉపేంద్ర‌, బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి.. ఇత‌ర పాత్ర‌ల్లో న‌దియా, న‌వీన్ చంద్ర‌, న‌రేష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి న‌టిస్తున్నారు.