Begin typing your search above and press return to search.

అంద‌రూ మిల్కీలానే కొండ‌ల్లోకి జంప్ చేస్తే!!

By:  Tupaki Desk   |   23 July 2020 9:30 AM IST
అంద‌రూ మిల్కీలానే కొండ‌ల్లోకి జంప్ చేస్తే!!
X
క‌రోనా దెబ్బ‌కు షివ‌రింగ్ వ‌చ్చేస్తోంది. ఎవ‌రికి వారు ఇండ్ల‌లోంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు భ‌య‌ప‌డుతున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో క‌లుపుకుని రోజుకు 5000-8000 కేసులు బ‌య‌ట‌ప‌డుతుంటే బెంబేలెత్తిపోతున్నారు. పాజిటివ్ కేసులు ల‌క్ష‌ల్లోకి చేరితే ప‌రిస్థితేమిటి? అన్న‌దే ఇప్పుడు చిక్కు ప్ర‌శ్న‌.

ఎవ‌రి టెన్ష‌న్ లో వాళ్లు ఉంటే ఏ టెన్ష‌న్ లేకుండా ఈవిడేమిటి ఇలా కొండ‌కోన‌ల్లో షికార్ల‌కు బ‌య‌ల్దేరింది? ``అంతా నా ఇష్టం. న‌చ్చిన‌ట్టే ఎంజాయ్ చేస్తాను! న‌న్ను చూశారా?`` అంటూ క‌వ్విస్తోంది మిల్కీ బ్యూటీ. ప్రకృతిని అన్వేషించడానికి కొత్త మార్గం.. స‌రికొత్త‌ అభిరుచి ఇదేన‌ని ఎదుటివారిని రెచ్చ‌గొడుతోంది.

ఇంత‌కీ ఈ ప్లేస్ ఎక్క‌డ‌? త‌ను ఒంట‌రిగానే వెళుతోందా? అంటే.. మహారాష్ట్రలోని థానేలో ఉన్న ప్రసిద్ధ ట్రెక్కింగ్ ప్లేస్ అసంగావ్ మహులి కోటను మిల్కీ ఇటీవల స‌హ‌చ‌రుల‌తో క‌లిసి సందర్శించింద‌ట‌. ఆమె ఇన్ ‌స్టాగ్రామ్ ‌లో ట్రెక్కింగ్ ఫోటోని షేర్ చేసింది. ``ప్రకృతిని కోల్పోయాక‌.. మీ అంత‌ట‌ మీరే మ‌ళ్లీ కనుగొంటారు`` అంటూ ఆస‌క్తిక‌ర కొటేష‌న్ ఇచ్చింది ఈ ఫోటోకి. త‌మ‌న్నా న్యూ ప్యాష‌న్ చాలా బావుంది. ఇంత‌కీ త‌న‌తో పాటే వ‌చ్చిన ఆ స‌హ‌చ‌రుడు ఎవ‌రు అన్న‌ది ఫోటో రివీల్ చేయ‌లేదింకా. కేవ‌లం త‌మ‌న్నా మాత్ర‌మే కాదు.. హైద‌రాబాద్ నుంచి ప‌ల్లెటూళ్ల‌కు త‌ర‌లి వెళ్లిపోయిన ల‌క్ష‌లాది మందిలో కొంద‌రు పొలాల‌కు వెళుతుంటే మ‌రికొంద‌రు హిల్ స్టేష‌న్ల‌లో న‌చ్చిన‌ట్టు ఎంజాయ్ చేస్తున్నారు. ప‌ల్లెల్లోనూ మ‌హ‌మ్మారీ టెన్ష‌న్ రాజుకుపోతుండ‌డంతో దూర‌పు అడ‌వుల్లోకి జంప్ అయిపోతున్నారు.