Begin typing your search above and press return to search.

తమన్నా వార్తలపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్‌

By:  Tupaki Desk   |   8 May 2020 10:10 AM GMT
తమన్నా వార్తలపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్‌
X
మిల్కీ బ్యూటీ తమన్న ఈమద్య కాలంలో కాస్త ఢల్‌ అయ్యింది. తెలుగు తమిళంలో వరుసగా స్టార్‌ హీరోలతో నటించిన ఈ అమ్మడు ప్రస్తుతం పెద్దగా ఆఫర్లు లేకపోవడంతో వచ్చిన ఆఫర్లతో సర్దుకు పోతుంది. ఈ సమయంలో తమన్నాకు కన్నడ స్టార్‌ హీరో యశ్‌ సరసన నటించే ఛాన్స్‌ వచ్చిందంటూ గత వారం రోజులుగా ప్రచారం జరుగుతోంది. కేజీఎఫ్‌ 2 తర్వాత యశ్‌ చేయబోతున్న చిత్రంకు నర్తన్‌ దర్శకత్వం వహించబోతున్నాడు. ఆ చిత్రంలో తమన్నా హీరోయిన్‌ అంటూ వార్తలు వచ్చాయి.

ఇప్పటి వరకు కన్నడంలో రెండు ఐటెం సాంగ్స్‌ మాత్రమే చేసిన తమన్నాకు హీరోయిన్‌ గా మొదటి ఛాన్స్‌ వచ్చిందని అంతా అనుకున్నారు. యశ్‌ తో సినిమా చేస్తే మరో మూడు నాలుగు సంవత్సరాల పాటు కన్నడంలో ఈ అమ్మడు బిజీగా ఉండే అవకాశం ఉంటుందనుకున్నారు. కాని తమన్నా కన్నడ మూవీ వార్తలు కేవలం పుకార్లే అంటూ దర్శకుడు నర్తన్‌ మాటలతో క్లారిటీ వచ్చేసింది.

తాజాగా దర్శకుడు నర్తన్‌ స్పందిస్తూ... ఇప్పటి వరకు స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి కాలేదు. తమన్నాను సంప్రదించినట్లుగా వచ్చిన వార్తల్లో నిజం లేదు. స్క్రిప్ట్‌ ఫైనల్‌ అయిన తర్వాత హీరోయిన్‌ విషయమై ఆలోచిస్తామన్నట్లుగా నర్తన్‌ చెప్పుకొచ్చాడు. ఆయన మాటలతో తమన్నా అభిమానుల ఆశలపై నీళ్లు జల్లినట్లయ్యింది. కన్నడంలో అసలు తమ్మూకు చేసే అవకాశం వస్తుందో? లేదో..?