Begin typing your search above and press return to search.
బ్యాడ్ బాయ్ సరసన తమన్నా
By: Tupaki Desk | 6 Sept 2016 11:00 PM ISTతమిళంలో విజయ్.. సూర్య.. ధనుష్.. కార్తి.. లాంటి ప్రముఖ హీరోలకు జోడీగా నటించింది మిల్కీ బ్యూటీ. లేటెస్టుగా విశాల్ సరసనా ఓ సినిమా చేస్తోంది. దీని తర్వాత ఆమెకు మరో స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ దొరికింది. కోలీవుడ్ బ్యాడ్ బాయ్ శింబుకు జోడీగా నటించబోతోంది మిల్కీ బ్యూటీ. శింబు కొత్త సినిమా ‘ఎఎఎ’లో ఆమెను ఒక హీరోయిన్ గా ఎంచుకున్నారు. ఇందులో మొత్తం ముగ్గురు హీరోయిన్లు. ఆల్రెడీ ఒక హీరోయిన్ గా శ్రియ ఎంపికైంది. రెండో హీరోయిన్ గా తమన్నా ఫిక్సయింది. ఇంకో హీరోయిన్ సంగతి తేలాల్సి ఉంది. శ్రియ ఎపిసోడ్ 80ల నేపథ్యంలో సాగుతుందట. ఆ ఎపిసోడ్ కోసం అప్పటి కాలాన్ని తలపించే గెటప్ వేస్తున్నాడు శింబు. శ్రియ కూడా కొంచెం వెరైటీగా కనిపిస్తోంది.
తమన్నా మోడర్న్ శింబుకు జోడీగా నటిస్తోంది. ‘ఎఎఎ’ అంటే అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్ (ప్రేమించేవాడు.. భయపడనివాడు లొంగనివాడు) అని అర్థం. ఇదొక సైంటిఫిక్ థ్రిల్లర్ అంటున్నారు. రెండేళ్ల పాటు అనేక వివాదాల్లో పడి కెరీర్ ను ప్రమాదంలో పడేసుకున్న శింబు.. ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాడు. ఈ మధ్యే అతడి ‘ఇదు నమ్మ ఆళు’ రిలీజై సూపర్ హిట్టయింది. మరోవైపు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చేస్తున్న ’అచ్చం ఎన్బదు మదమైయద’ (సాహసం శ్వాసగా సాగిపో) సినిమాను కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తేబోతున్నారు. ‘త్రిష ఇల్లాన నయనతార’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆధిక్ రవిచంద్రన్ ‘ఎఎఎ’ను డైరెక్ట్ చేస్తున్నాడు.