Begin typing your search above and press return to search.

ఆ బంపర్ ఆఫర్ హృతిక్ కు మాత్రమే!

By:  Tupaki Desk   |   1 March 2019 4:34 PM GMT
ఆ బంపర్ ఆఫర్ హృతిక్ కు మాత్రమే!
X
తమన్నా 14 ఇయర్స్ ఇండస్ట్రీ. హీరోలకు.. క్యారెక్టర్ ఆర్టిస్టులకు 14 అనే నెంబర్ చాలా చిన్నది కావచ్చు కానీ ఒక హీరోయిన్ గా అది చా..లా.. పెద్ద నెంబర్. ఈ జెనరేషన్ హీరోయిన్లకు నాలుగైదేళ్ళు ఇండస్ట్రీలో కొనసాగడం గగనంగా ఉంది. అలాంటిది 14 ఏళ్ళు హీరోయిన్ గా కంటిన్యూ కావడం అంటే గ్రేట్ అఛీవ్ మెంటే కదా. అలాంటి ఘనత సాధించింది మిల్కీ బ్యూటీ తమన్నా. సరేగానీ ఇన్నేళ్ళలో ఈ మిల్కీ ఎవరికీ లిప్పు కిస్సులు ఇవ్వలేదు. మనం మాట్లాడుకునేది రియల్ లైఫు గురించి కాదు కాదు.. రీల్ లైఫ్ గురించి.

ఇప్పుడు బాలీవుడ్.. టాలీవుడ్ అనే తేడాలేకుండా లిప్పు లాకులను చాలా చాలా కామన్ చేసిపారేశారు. చివరికి పరిస్థితి ఎలా ఉందంటే.. లిప్పు కిస్ ఇవ్వకపోతే "అసలు నువ్వు హీరోయినేనా?" అని అడిగేలా ఉన్నారు. కానీ మిల్కీకి మాత్రం ఎందుకో ముద్దు సీన్లలో నటించాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదట. అందుకే ఇప్పటివరకూ తన నటించే సినిమాలలో లిప్ లాకులు చెయ్యననే కండిషన్ పెట్టేదట. ఇంత పట్టింపు ఉన్నప్పటికీ ఒక హీరోకు మాత్రం ఈ విషయంలో ఎక్సెప్షన్ ఇస్తుందట. ఆ హీరో ఎవరంటే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్.

ఆయనకే ఈ బంపర్ ఆఫర్ ఎందుకు అంటే..దానికో లాజిక్ ఉంది. హృతిక్ అంటే చాలు.. మన మిల్కీ బ్యూటీ పడిచచ్చిపోతుందట. పే..ద్ద ఫ్యాన్ అంట. ఒకవేళ హృతిక్ సినిమాలో నటించే అవకాశం వస్తే ముద్దులు ధారాళంగా ఇస్తానని రీసెంట్ గా ఒక చాట్ షో లో వెల్లడించింది. స్వామి కార్యం.. స్వకార్యం అన్నమాట. క్రేజీ బాలీవుడ్ ఆఫర్ తో పాటు ముద్దు ముచ్చట కూడా తీర్చుకోవచ్చు. బాగానే ఉంది మిల్కీ పురాణం. పొరపాటున కంగనాకు.. రంగోలి చందేల్ కు కనుక ఈ విషయం తెలిసిందే అనుకో.. అప్పుడు చూడాలి.. నాసామి రంగ..!