Begin typing your search above and press return to search.

రెడ్ డ్రెస్ లో మెరిసిపోతున్న తమన్నా.. స్టన్నింగ్

By:  Tupaki Desk   |   20 Jan 2023 1:52 PM GMT
రెడ్ డ్రెస్ లో మెరిసిపోతున్న తమన్నా.. స్టన్నింగ్
X
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 15 ఏళ్ళు దాటిపోయింది. ఇన్నేళ్ళ కెరియర్ లో సౌత్ లో స్టార్ హీరోలు అందరితో ఈమె జోడీ కట్టింది. ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోలకి ఫస్ట్ ఛాయస్ గా తమన్నా మారిపోయింది. ఓ వైపు మెగాస్టార్ చిరంజీవికి జోడీగా భోళా శంకర్ సినిమాలో తమన్నా ఆడిపాడబోతుంది. మరో వైపు సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాలో కూడా తమన్నా నటిస్తుంది.

ఈ రెండు సినిమాలపై ఆమె హోప్స్ పెట్టుకుంది. మరో వైపు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తుంది. అలాగే డిజిటల్ ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే రెండు వెబ్ సిరీస్ లలో నటించింది. ఈ రెండింటికి మంచి గుర్తింపు వచ్చింది.

వీటితో పాటు తమన్నా లీడ్ రోల్ లో మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ లలో తమన్నా కూడా ఉంది. ఈ మిల్కీ బ్యూటీ అందం వయస్సు పెరుగుతున్న కొద్ది మరింత పెరిగిపోతుంది.

బాహుబలిలో దేవకన్య తరహాలో అందంతో మెస్మరైజ్ చేసిన తమన్నా మరోసారి మ్యాగజైన్ కవర్ పేజీపై హాట్ లుక్స్ తో దేవకన్యలా కనిపించి మైమరచిపోయేలా చేస్తుంది. ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ ఫస్ట్ లుక్ కవర్ పేజీపై ఆమె హాట్ లుక్స్ తో దర్శనం ఇచ్చింది. ఎక్కువగా బాలీవుడ్ హీరోయిన్స్ కి ఫస్ట్ లుక్ కవర్ పేజీపై కనిపించే అవకాశం వస్తుంది. అయితే తమన్నా ఈ సారి కవర్ పేజీపై రెండ కాస్ట్యూమ్స్ లో మెస్మరైజ్ చేస్తుంది.

ఇన్స్టాగ్రామ్ లో తమన్నా ఈ ఫోటోని షేర్ చేసింది. దీనిపై నెటిజన్లు కూడా ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. తమన్నాని ఈ లుక్ లో చూడటానికి రెండు కళ్ళు సరిపోవడం లేదని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక తమన్నా ఈ లుక్ ని తన ఇన్స్టాలో షేర్ చేసి 30 నిమిషాల్లో ఏకంగా 40 వేల మందికి పైగా వీక్షించడం చూస్తుంటే తమన్నాకి ఉన్న క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. మరి తమన్నా అందాన్ని ఆస్వాదించాలంటే మీరు కూడా ఫస్ట్ లుక్ కవర్ పేజీపై ఉన్న ఆమె లుక్ ని చూసి తీరాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.