Begin typing your search above and press return to search.

గాలివాన‌లో బ్రంచ్ పార్టీలేమిటి మిల్కీ?

By:  Tupaki Desk   |   1 July 2019 6:36 AM GMT
గాలివాన‌లో బ్రంచ్ పార్టీలేమిటి మిల్కీ?
X
స్టార్లు కుటుంబ స‌మేతంగా `సండే బ్రంచ్` పేరుతో సెల‌బ్రేష‌న్స్ కి వెళుతుంటార‌న్న సంగ‌తి తెలిసిందే. నిరంత‌రం బిజీ షెడ్యూల్స్ తో కుస్తీ ప‌ట్టే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వారాంతాల్లో ఇలా ప్లాన్ చేస్తుంటారు. ఇదివ‌ర‌కూ త‌న ఫ్యామిలీలో పిల్ల‌లంద‌రితో క‌లిసి హైద‌రాబాద్ లోని ఓ రెస్టారెంట్ కి బ్రంచ్ కి వెళ్లిన ఫోటోలు రివీల‌య్యాయి. ఆ ఫోటోల్లో స్నేహారెడ్డి కూడా ఉన్నారు. ఈసారి కాస్తంత వెరైటీ కోసం ముంబై బీచ్ ఏరియాలోని ఓ ఖ‌రీదైన హోట‌ల్లో బ్రంచ్ కి వెళ్లాడు. ఈ బ్రంచ్ లో త‌న స‌తీమ‌ణి స్నేహారెడ్డి స‌హా ఇత‌ర కుటుంబ స‌భ్యులు ఉన్నారు. ఆస‌క్తిక‌రంగా ఈ బ్రంచ్ లో ఓ స్పెష‌ల్ గెస్ట్ స‌డెన్ గా అప్పియ‌రెన్స్ ఇవ్వ‌డం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇంత‌కీ ఎవ‌రా స్పెష‌ల్ గెస్ట్? అంటే.. ఇంకెవ‌రు మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా.

ఈ ఆదివారం లంచ్ ఎక్క‌డైతే బావుంటుంది? అనుకుంటున్న మిల్కీ బ్యూటీకి అదిరిపోయే బ్రంచ్ ఆఫ‌ర్ త‌గిలింది. అస‌లే వానాకాలం. పైగా ముంబై చిట‌ప‌ట చినుకుల‌తో త‌డిసి ఆహ్లాదాన్ని ప‌రుచుకుంది. ఈ టైమ్ లో అనుకున్న‌దే త‌డ‌వుగా ఇలా త‌న ఫేవ‌రెట్ హీరో బ‌న్ని బ్రంచ్ ఆఫ‌ర్ చేయ‌డంతో అక్క‌డికి రెక్క‌లు క‌ట్టుకుని వాలిపోయింది. సండే బ్రంచ్ కి స్టార్ హీరో ఫ్యామిలీతో జాయిన్ అయిన త‌మ‌న్నా అక్క‌డికి స‌మ్మ‌ర్ డ్రెస్ లో దిగిపోయింది. వైట్ డ్రెస్ లో ఎంతో సింపుల్ గా క‌నిపించిన ఈ బ్యూటీ అల్ట్రా మోడ్ర‌న్ వైట్ ఫ్రేమ్ గ్లాసెస్ తో క‌నిపించి ట్రీటిచ్చింది. త‌మ‌న్నా హెయిర్ స్టైల్ అంతే క్యాజువ‌ల్ గా క‌నిపించింది. మిల్కీ బ్యూటీ అలా కార్ నుంచి దిగి వెళుతుంటే అక్క‌డ నేల వాన నీటితో త‌డిసి క‌నిపించింది.

త‌మ‌న్నా ని కెరీర్ ప‌రంగా చూస్తే.. `ఎఫ్ 2` త‌ర్వాత ఫుల్ బిజీ. ఇటు సౌత్ అటు నార్త్ రెండుచోట్లా బిజీబిజీగా ఉంది. ఇక్క‌డో సినిమా అక్క‌డో సినిమా అన్న‌ట్టుగానే ప్లాన్ చేస్తోంది. ఎఫ్ 2 కంటే ముందే ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి (క్వీన్ రీమేక్) రిలీజ్ కావాల్సి ఉన్నా వాయిదా ప‌డింది. ఈలోగానే అభినేత్రి 2 రిలీజైంది. అలాగే రీసెంట్ గానే కామోషీ అనే హిందీ చిత్రం రిలీజైంది. ఇవేవీ బాక్సాఫీస్ వ‌ద్ద హిట్లు కాక‌పోయినా త‌మ‌న్నాకు కెరీర్ ప‌రంగా వ‌చ్చిన‌ న‌ష్ట‌మేమీ లేదు. ప్ర‌స్తుతం `బోలె చుడియాన్` అనే బాలీవుడ్ చిత్రానికి సంతకం చేసింది. వాస్త‌వానికి ఆ ఆఫ‌ర్ తొలుత మౌనీరాయ్ ని వ‌రించినా తాను త‌ప్పుకోవ‌డంతో త‌మ‌న్నాకు అది ఆయాచిత వ‌రంగా మారింది. ఈ చిత్రంలో త‌న పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంద‌ని.. ర‌క‌ర‌కాల పార్శ్యాల్ని స్ప‌ర్శిస్తుంద‌ని మిల్కీ తెలిపింది. ఈ చిత్రంలో ట్యాలెంటెడ్ న‌వాజుద్దీన్ సిద్ధికి హీరోగా న‌టిస్తుండ‌డం మ‌రో అస్సెట్.