Begin typing your search above and press return to search.

తమన్నా వెబ్‌ సిరీస్‌ కథ ఇదేనట!

By:  Tupaki Desk   |   25 March 2021 5:57 AM GMT
తమన్నా వెబ్‌ సిరీస్‌ కథ ఇదేనట!
X
టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ ఇప్పటికే లైవ్‌ టెలికాస్ట్‌ అనే వెబ్‌ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హాట్ స్టార్ లో ఉన్న ఆ వెబ్ సిరీస్ ను జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. అయినా కూడా ఆ వెబ్‌ సిరీస్ లో కాజల్‌ నటకు మంచి మార్కులు అయితే పడ్డాయి. పెద్ద ఎత్తున అంచనాలున్న వెబ్‌ సిరీస్ కు ఆశించిన స్తాయిలో స్పందన రాకపోవడంతో కాజల్‌ కాస్త నిరుత్సాహం వ్యక్తం చేసింది. ఆ విషయాన్ని పక్కన పెడితే వచ్చే నెల ఆరంభంలో తమన్నా తన వెబ్‌ ఎంట్రీకి సిద్దం అయ్యింది. 'లెవన్త్‌ అవర్‌' అనే వెబ్‌ సిరీస్‌ ను కాజల్‌ ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో చేసింది. ఆ వెబ్‌ సిరీస్ ను ఏప్రిల్‌ 9న స్ట్రీమింగ్ కు సిద్దం చేశారు.

మల్టీ బిలియన్‌ డాలర్స్‌ కంపెనీ అయిన ఆధిత్య గ్రూప్‌ కి సీఈఓ అయిన అరత్రికా రెడ్డి అనూహ్యంగా ఆర్థిక సమస్యల చట్రంలో చిక్కుకుటుంది. స్నేహితులు ఆమెకు శత్రువులుగా మారడంతో ఆమె చేసింది ఏంటీ ఆ విపత్తు నుండి అరత్రికా రెడ్డి బయటకు వచ్చిన తీరు ఎలా ఉంటుంది అనేది వెబ్‌ సిరీస్‌ లో చూసి తెలుసుకోవాల్సిందే అంటున్నారు మేకర్స్. ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్స్ గా ఉంటుందట. ఉపేంద్ర నంబూరి రాసిన '8 అవర్స్‌' పుస్తకంను ఇన్సిపిరేషన్ గా తీసుకుని ఈ కథను రాసినట్లుగా తెలుస్తోంది. పురుషాధిక్య సమాజంలో స్త్రీలు పడుతున్న ఇబ్బందుల గురించి ఈ వెబ్‌ సిరీస్ లో చూపించబోతున్నారట. ఆహాలో స్ట్రీమింగ్ కు సిద్దం అయిన ఈ వెబ్‌ సిరీస్ తమన్నాకు ఎలాంటి ఇమేజ్ ను తెచ్చి పెడుతుంది అనేది చూడాలి.