Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : అమ్మడి రెయిన్‌ డాన్స్‌ అదరహో అదే రెయిన్‌ లో వర్కౌట్స్‌ చేస్తే.. మాటల్లేవ్‌

By:  Tupaki Desk   |   20 July 2020 1:00 PM GMT
ఫొటోటాక్‌ : అమ్మడి రెయిన్‌ డాన్స్‌ అదరహో అదే రెయిన్‌ లో వర్కౌట్స్‌ చేస్తే.. మాటల్లేవ్‌
X
‘రచ్చ’ చిత్రంలో రామ్‌ చరణ్‌ తో కలిసి రెయిన్‌ డాన్స్‌ చేసిన మిల్కీ బ్యూటీ తమన్నాను ఇంకా మర్చి పోలేరు. ఈతరం హీరోయిన్స్‌ లో రెయిన్‌ డాన్స్‌ లో అదరగొట్టిన హీరోయిన్స్‌ లో తమన్నా ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అద్బుతమైన తన డాన్స్‌ ను వర్షంలో వేయడంతో మరింతగా అద్బుతం జత కలిసినట్లుగా అనిపించింది. ఆ పాట తాలూకు జ్ఞాపకాలు ఇంకా అభిమానుల్లో ఉండగానే మరో చెరిగి పోని జ్ఞాపకాన్ని ముద్ర వేసింది.

ముంబయిలోని తన ఇంట్లో వర్కౌట్స్‌ చేస్తూ ఉన్న తమన్నా స్టిల్స్‌ ఈమద్య రెగ్యులర్‌ గా సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి. అయితే ఈసారి తమన్నా పోస్ట్‌ చేసిన ఫొటో మరింత స్పెషల్‌ గా ఉంది. వర్షంలో వర్కౌట్స్‌ చేయడంతో పాటు థెరపీ కూడా తీసుకుంటుంది. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌ అవుతోంది. మిల్కీ బ్యూటీ అభిమానులకు ఈ ఫొటో మాన్‌ సూన్‌ గిఫ్ట్‌ గా చెప్పుకోవచ్చు. తమన్నా రెయిన్‌ డాన్స్‌ ను మించి ఈ స్టిల్‌ ఉందంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

మిల్కీ బ్యూటీ తమన్నా వర్షంలో ఇచ్చిన ఫోజ్‌ ఈ దశాబ్దపు బెస్ట్‌ ఫొటో అంటూ ఆమె అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికి వర్షంలో మిల్కీ బ్యూటీ తడిసిన అందాలను నెటిజన్స్‌ తెగ ఎంజాయ్‌ అయితే చేస్తున్నారు. ఈమద్య కాలంలో కాస్త ఆఫర్లు తగ్గడం వల్ల సోషల్‌ మీడియాలో బాగా యాక్టివ్‌ అయ్యింది తమన్నా. ఇటీవలే ఈమె ఆచార్య చిత్రంలో రామ్‌ చరణ్‌ కు జోడీగా కీలకమైన చిన్న పాత్రలో ఎంపిక అయ్యిందని టాక్‌ వినిపిస్తుంది. ఆ విషయమై ఇంకా అధికారిక స్పందన రావాల్సి ఉంది.