Begin typing your search above and press return to search.

శ్రియ పోయి త‌మ‌న్నా వ‌చ్చే!!

By:  Tupaki Desk   |   28 March 2018 10:49 AM GMT
శ్రియ పోయి త‌మ‌న్నా వ‌చ్చే!!
X
అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో విక్ట‌రీ వెంక‌టేష్‌ - వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్‌ లో తెర‌కెక్కుతున్న మ‌ల్టీస్టార‌ర్ చిత్రం ‘ఎఫ్ 2’. ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్ అనేది ఉప శీర్షిక‌. ఈ సినిమాలో విక్ట‌రీ వెంక‌టేష్‌ కు జోడిగా మొద‌ట సీనియ‌ర్ హీరోయిన్ శ్రియ శ‌ర‌ణ్‌ ను ఎంపిక చేశారు. అయితే అమ్మ‌డు చెప్పా పెట్ట‌కుండా పెళ్లి చేసుకోవ‌డంతో ఆమె స్థానంలో కుర్ర హీరోయిన్ త‌మన్నాని ఎంపిక చేసింది చిత్ర బృందం.

‘సుప్రీమ్‌’ - ‘ప‌టాస్‌’ - ‘రాజా ది గ్రేట్‌’ వంటి కామెడీ ఎంట‌ర్‌ టైన్‌ మెంట్ చిత్రాలు తీయడంలో దిట్ట‌గా పేరొందిన అనిల్ రావిపూడి - ఈ సినిమాని కూడా ఆ చిత్రాల స్థాయికి త‌గ్గ‌కుండా మంచి కామెడీ ఎంట‌ర్‌ టైన‌ర్‌ లానే రూపొందిస్తున్నాడ‌ని స‌మాచారం. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ఈ క్రేజీ చిత్రానికి నిర్మాత‌. ఇందులో వెంకీ స‌ర‌స‌న మొద‌ట సీనియ‌ర్ హీరోయిన్ శ్రియ‌ను ఎంపిక చేశారు. అయితే శ్రియ చెప్పాపెట్ట‌కుండా బాయ్‌ ఫ్రెండ్‌ ను పెళ్లి చేసుకోవ‌డంతో సందిగ్ధంలో ప‌డింది చిత్ర బృందం. శ్రియ కొత్త సినిమాలేవీ ఒప్పుకోవ‌ట్లేదు. ఇప్ప‌టికే ఒప్పుకున్న సినిమాల‌ను కూడా త్వ‌ర‌గా పూర్తి చేసి, భ‌ర్త‌తో క‌లిసి వ్యాపారంలో స్థిర‌ప‌డాల‌ని అనుకుంటోంది. దీంతో శ్రియ స్థానంలో మ‌రో కొత్త హీరోయిన్‌ ని ఎంచుకోవాల్సిన అవ‌సరం ప‌డింది. దీంతో త‌మ‌న్నాను సంప్ర‌దించాడ‌ట అనిల్ రావిపూడి. క‌థ విన్న త‌మ్మూ - చేయ‌డానికి ఒప్పుకుంద‌ని - త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రావ‌డ‌మే త‌రువాయి అని స‌మాచారం.

ప్ర‌స్తుతం వ‌రుణ్‌ - వెంకీ వేరే సినిమాల‌తో బిజీగా ఉండ‌డంతో జూన్ త‌ర్వాత ఈ సినిమా షూటింగ్‌ కి వెళ్లాల‌ని కూడా ప్లాన్‌ చేస్తున్నారు. ఈ లోపు ఫైన‌ల్ స్కిప్టును న‌టీన‌టులు - సాంకేతిక నిపుణుల‌ను ఎంపిక చేసే ప‌నిలో ఉన్నాడు అనిల్ రావిపూడి.