Begin typing your search above and press return to search.

వామ్మో ఈ తిట్లేంది.. ఈ రచ్చేంది తమన్నా?

By:  Tupaki Desk   |   6 Aug 2019 7:20 AM GMT
వామ్మో ఈ తిట్లేంది.. ఈ రచ్చేంది తమన్నా?
X
గడిచిన రెండు సీజన్లకు భిన్నంగా వివాదాలతో మొదలైంది బిగ్ బాస్ సీజన్ 3. షో స్టార్ట్ కాకముందే బిగ్ బాస్ మీద నిందలుపడ్డాయి. షోకు తమను ఎంపిక చేసి.. తర్వాత రిజెక్ట్ చేశారంటూ ఆరోపించటమే కాదు.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పరిస్థితి. షో మొదలైన నాటి నుంచి ఏదో ఒక వివాదం హౌస్ లో నడుస్తోంది. గడిచిన రెండు సీజన్లతో పోలిస్తే.. ఈ సీజన్ లో ఇంటి సభ్యుల మధ్య రచ్చ భారీగా నడుస్తోంది.

బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్ వ్యవహరించిన తీరు.. ఒకదశలో బిగ్ బాస్ సైతం అతన్ని ఏమీ అనలేని పరిస్థితి తెలిసిందే. సీజన్ 2లో కౌశల్ వర్సెస్ మొత్తం హౌస్ నిలవటం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి మధ్య మాటల తూటాలు పేలేవి. తాజా సీజన్ 3లో ఇప్పుడు పరిస్థితి మరింత ఖరాబుగా మారింది. హౌస్ లో అదేపనిగా నోరు పారేసుకుంటున్న తమన్నా తీరుతో హౌస్ మేట్స్ తో పాటు.. టీవీలో షో చూస్తున్న వారు సైతం ఇరిటేట్ అయ్యేలా వ్యవహరిస్తోంది.

గతంలో రవిక్రిష్ణను మంచోడిగా వ్యాఖ్యలు చేసిన తమన్నా.. తాజా ఎపిసోడ్ లో ఆమెను నామినేట్ చేయటం.. దానికి కారణం చెబుతూ..‘‘ఒక మిస్టేక్ చేసి మళ్లీ వెంటనే రియలైజ్ అయ్యి వెంటనే సారీ చెబుతారు’’ అని రవికృష్ణ చెబుతుండగానే తమన్నా ‘‘ఏయ్.. ఆపేయ్’’ అంటూ అడ్డుపడ్డారు. తనను నామినేట్ చేశారన్న కోపంతో బ్యాలెన్స్ మిస్ అయిన తమన్నా.. ‘‘సిగ్గులేదురా. తు.. నన్ను నేను ఊసుకోవాలి ఇలాంటోడికి నేను సపోర్ట్ చేసినందుకు’’ అని మాట్లాడటంతో హౌస్ మేట్స్ అందరూ షాక్ కు గురైన పరిస్థితి.

ఎలిమినేషన్ తర్వాత రవిక్రిష్ణను టార్గెట్ చేస్తూ.. నువ్ మగాడివేనా? ఉన్న వాటిని కూడా గీసేసుకో.. పప్పూ అంటూ వ్యక్తిగత దూషణకు దిగింది. హౌస్ మేట్స్ కల్పించుకుని సర్ధిచెప్పే ప్రయత్నం చేసినా ఆగలేదు. తమన్నా తీరును శ్రీముఖి తీవ్రంగా ఖండించటంతో.. హౌస్ లో నా ఇష్టం ఉన్నట్లు ఉంటా.. ఇకపై చుక్కలు చూపిస్తానంటూ మాట్లాడటం. దీనికి శ్రీముఖి తన అసహనాన్ని వ్యక్తం చేసింది.

తనను అన్నేసి మాటలు అంటూ.. వ్యక్తిగతంగా తిట్టేసినా రవిక్రిష్ణ మాత్రం కామ్ గా ఉండిపోయాడు. తమన్నా తప్పుల్ని ఎత్తి చూపుతూ.. సలహాలు చెప్పే ప్రయత్నం చేసిన రోహిణి.. శివజ్యోతిలకు సైతం వార్నింగ్ ఇచ్చేసింది. తమన్నా మాటల్ని చూసినప్పుడు.. వామ్మో.. ఈ తిట్లేంది? ఈ రచ్చేంది అనిపించక మానదు. మొత్తంగా తన తీరుతో చిరాకు పుట్టించేస్తున్న తమన్నా విషయంలో బిగ్ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.