Begin typing your search above and press return to search.

మిల్కీ బ్యూటీ ఆ రీమేక్ కి ఓకే చెప్పడానికి కారణం అదేనా...?

By:  Tupaki Desk   |   19 July 2020 12:30 AM GMT
మిల్కీ బ్యూటీ ఆ రీమేక్ కి ఓకే చెప్పడానికి కారణం అదేనా...?
X
సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం గోపిచంద్ సరసన 'సీటీమార్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కన్నడలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'లవ్ మాక్ టైల్' తెలుగులో రీమేక్ లో నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. సత్యదేవ్ హీరోగా నటించనున్న ఈ సినిమాని నాగ శేఖర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ గా రూపొందిన 'లవ్ మాక్ టైల్' కన్నడలో మంచి విజయాన్ని సాధించడంతో ఈ చిత్ర రీమేక్ రైట్స్ నాగశేఖర్ తీసుకున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రానికి కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతాన్ని సమకూర్చనున్నాడు. అయితే నిన్నటి వరకు టాలీవుడ్ లో స్టార్ హీరోల పక్కన నటించిన మిల్కీ బ్యూటీ తమన్నాకు సినిమా ఆఫర్స్ తగ్గడం వల్లనే సత్యదేవ్ తో నటించడానికి ఒప్పుకుందని ఇండస్ట్రీ జనాలు అనుకుంటున్నారు.

కాగా 'లవ్ మాక్ టైల్' తెలుగు రీమేక్ కోసం మిల్కీ బ్యూటీకి భారీగానే డిమాండ్ చేస్తోందట. రీమేక్ అయినా.. అది హిట్ అవుతుందా లేదా ఫ్లాప్ అవుతుందా కూడా మ్యాటర్ కాదు.. కానీ నా ప‌క్క‌న చేస్తున్న హీరోకి అంతగా క్రేజ్ లేదు.. అలానే ఈ సినిమాలో నేను పోషించ‌బోయేది డీ గ్లామ‌ర్ రోల్ అనే భావనలో ఉందట తమన్నా. అందువల్ల డిమాండ్ చేసినంత రెమ్యూన‌రేష‌న్ ఇవ్వమని కోరుతోందట. ఇక త‌మ‌న్నా 'ల‌వ్ మాక్ టైల్' తెలుగు రీమేక్ కోసం పారితోషికంగా సుమారు రెండున్న‌ర కోట్లు అందుకోబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రొడ్యూసర్స్ కూడా ఎంతైనా ఇచ్చి మిల్కీ బ్యూటీని ఈ చిత్రంలో నటింపజేయాలనే ఆలోచనలో ఉన్నారట. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే ఈ సినిమా పట్టాలెక్కేవరకు వెయిట్ చేయాల్సిందే. ఇదిలా ఉండగా అమ్మడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తో కలిసి నటించిన 'భోలే చుడియన్' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' లో కూడా నటించబోతుందని వార్తలు వస్తున్నాయి.