Begin typing your search above and press return to search.

తెలుగు థోర్ మహేష్.. తమిళంలో సూర్య!

By:  Tupaki Desk   |   2 March 2019 8:08 AM GMT
తెలుగు థోర్ మహేష్.. తమిళంలో సూర్య!
X
హాలీవుడ్ లో తెరకెక్కే సూపర్ హీరో సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. సూపర్ మ్యాన్.. స్పైడర్ మ్యాన్.. బ్యాట్ మాన్.. హల్క్.. ఇలా చెప్పుకుంటూ పోతే డజన్ల కొద్దీ సూపర్ హీరోలు ఉన్నారు. ఇలాంటి సూపర్ హీరోలలో థోర్ కూడా ఒకరు. ఆస్ట్రేలియన్ యాక్టర్ క్రిస్ హెమ్స్ వర్త్ థోర్ పాత్రలో అరడజను కు పైగా సినిమాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అయినా ఇప్పుడు ఈ థోర్ పాత్ర గురించి ఇంట్రో ఎందుకు అంటే.. ఈ పాత్రలో మన సూపర్ స్టార్ మహేష్ నటిస్తే బాగుంటుందని మిల్కీ బ్యూటీ తమన్నా అంటోంది.

ఐడియా సూపర్ గా ఉంది కదా? రీసెంట్ గా చెన్నై లో 'కెప్టెన్ మార్వెల్' అనే సూపర్ హీరోయిన్ ఫ్రాంచైజీ కి సంబంధించిన ఫస్ట్ సినిమా ప్రెస్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమానికి నలుగురు స్టార్ హీరోయిన్లు ముఖ్యమైన అతిథులుగా హాజరయ్యారు. ఆ నలుగురు తమన్నా.. సమంతా.. రకుల్.. కాజల్ ఆగర్వాల్. ప్రెస్ మీట్ లో భాగంగా తమన్నాను ఒక ప్రశ్న అడిగితే 'థోర్ పాత్రను తెలుగులో మహేష్ బాబు.. తమిళంలో సూర్య చేస్తే చూడాలని ఉందని' చెప్పింది. అదే కాజల్ అగర్వాల్ మాత్రం తమిళంలో సూర్యకు బదులుగా అజిత్ చేస్తే బాగుటుందని తన అభిప్రాయం వెల్లడించింది.

హాలీవుడ్ లో సూపర్ హీరో పాత్రలు కామనే కానీ టాలీవుడ్ లో దాదాపు అలాంటి సినిమాలు రావు. హిందీలో అలా సూపర్ హీరో పాత్రతో సక్సెస్ అయిన ఫ్రాంచైజీ హృతిక్ రోషన్ 'క్రిష్' మాత్రమే. మన మహేష్ బాబు కోసం కూడా అలాంటి సూపర్ హీరో పాత్రను ఎవరైనా టాలీవుడ్ ఫిలిం మేకర్స్ డిజైన్ చేస్తే బాగుంటుంది కదా.