Begin typing your search above and press return to search.

మిల్కీ బ్యూటి.. ఐటెం కాదు బాబూ

By:  Tupaki Desk   |   29 Aug 2016 10:22 AM IST
మిల్కీ బ్యూటి.. ఐటెం కాదు బాబూ
X
ఈ మధ్య తమన్నా కెరీర్ బాగా స్లో అయిపోయిందని.. అసలు సినిమా ఛాన్సులు రావడం లేదనే టాక్ ఉంది. తెలుగు వరకు ఈ ఆరోపణలు ఓకే కానీ.. తమిళ్ లో ఈమె విశాల్ తో నటించిన కత్తి సాందాయ్ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. నిన్ననే సినిమా పేరు ''ఒక్కడొచ్చాడు'' అని ఖరారు చేస్తూ.. తెలుగు పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. అయితే.. ఈ మూవీలో తమ్మూ రోల్ పై రకరకాల రూమర్స్ ఉన్నాయి.

ఓ లీడింగ్ ఇంగ్లీష్ డైలీలో కత్తి సాందాయ్ లో తమ్మూ ఐటెమ్ సాంగ్ లో చేస్తోందనే న్యూస్ రాగానే.. అందరూ ఇదే ఫాలో అయిపోయారు. ఎక్కడ చూసినా తమ్మూ ఐటెం సాంగ్ గురించి ఆర్టికల్స్ వచ్చేశాయి. పైగా అసలు సైలెంట్ గా ఈ ఆఫర్ పట్టేసిందనే టాక్ కూడా ఉంది. అయితే.. అసలు విషయం ఏంటంటే.. ఈ కత్తి సాందాయ్ లో విశాల్ పక్కన తమ్ము చేస్తోంది ఐటెమ్ రోల్ కాదు. ఇది ఫుల్ ప్లెడ్జెడ్ హీరోయిన్ రోల్. అప్పుడెప్పుడో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.. ఇప్పుడు ఫినిషింగ్ స్టేజ్ కి కూడా వచ్చేసింది. నల్లనయ్యతో మిల్కీ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉండనుందనే విషయం ఇప్పటికే పోస్టర్ల ద్వారా తేలిపోతోంది. పైగా ఈసినిమాలో తమన్నా ఒక్కతే హీరోయిన్.. మరో ఫిమేల్ లీడ్ కూడా లేదు. కాబట్టి ఇప్పటికైనా.. తమన్నా చేస్తోంది హీరోయిన్ పాత్రే అని అర్ధం చేసుకోవడం బెటర్.

ఇప్పటికే పాటలను రిలీజ్ చేయడంలో బిజీ అయిన విశాల్.. త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేసేస్తా అంటున్నాడు. మొన్నామధ్యన తమిళంలో ధర్మదురై సినిమాతో యావరేజ్ హిట్టు కొట్టిన మిల్కీ.. ఈ సినిమాతోనైనా పెద్ద హిట్టు కొడుతుందేమో చూడాలి.