Begin typing your search above and press return to search.
తాప్సీలా మిల్కీకి జ్ఞానబల్బు వెలిగింది
By: Tupaki Desk | 12 July 2015 5:03 PM ISTజ్ఞాన బల్బు అని ఒకటి ఉంటుంది. అది వెలగాలంటే చాలామందికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఇక హీరోయిన్ల విషయానొకిస్తే.. ఓ సరైన పాత్ర వారికి చిక్కినప్పుడే నిజంగా ఆ జ్ఞాన బల్బు వెలిగినట్లు. మొన్నామధ్య.. ఒక దెయ్యం పట్టేసిన పాత్రను చేయడంతో రింగులు జుత్తు గంగ తాప్సీకి జ్ఞానబల్బు వెలిగేసింది. అమ్మడు ఆ సినిమా చేశాక ఇక వరుసగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు సైన్ చేస్తూ పోతోంది.
ఇప్పుడిక డిస్కషన్ అంతా తమన్నా గురించే. బాహుబలి సినిమా ఫస్టాఫ్ అంతా తమన్నాదే. అమ్మడి అందాలతో తడిసి ముద్దయిన శివుడు, ఆ తరువాత ఆమె కత్తిపోటుతో రెండు చుక్కల రక్తం కూడా ఓడుస్తాడు. అయితే ఈ సినిమాలో మిల్కీ రోల్ బాగాలేదంటూ మన సౌత్‌లో కామెంట్స్ వినిపిస్తే.. నార్త్‌లో మాత్రం అమ్మడికి జేజేలు కొట్టేస్తున్నారు. మైండ్ బ్లోయింగ్ పెర్‌ఫార్మెన్స్ అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఇప్పుడు బాలీవుడ్‌లో మిల్కీకి జ్ఞానబల్బు వెలిగినట్లే అనిపిస్తోంది. పెద్దపెద్ద స్టార్ల సినిమాల్లో పవర్‌ఫుల్ పాత్రలు అమ్మడికి వచ్చే ఛాన్సుంది మరి. అయితే తన పిఆర్ యంత్రాంగంతో ఎంత ఫాస్ట్‌గా వర్కవుట్ చేసుకుంటే అమ్మడికి అంత బెటర్.