Begin typing your search above and press return to search.

నడుమూ నాభి కాదా?? కళ్ళా??

By:  Tupaki Desk   |   14 March 2018 11:00 PM IST
నడుమూ నాభి కాదా?? కళ్ళా??
X
మిల్కీ బ్యూటీ తమన్నాకు బోలెడంత మంది అభిమాన గణం ఉంటుంది. చిన్న వయసులోనే హీరోయిన్ అయిపోయి.. టీనేజ్ ముగిసేసరికే స్టార్ ఇమేజ్ కూడా సంపాదించేసుకున్న తమన్నా భాటియా.. సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నా.. ఇంకా ఆమె వయసు ఇంకా 28 సంవత్సరాలే.

ఇంతకాలంగా మిల్కీ అందాలను ఆరాధిస్తున్న అభిమానులకు తమ్మూ ఇప్పుడో స్వీట్ సీక్రెట్ చెప్పేసింది. అసలు తమన్నా అనగానే జనాలకు ముఖ్యంగా ఫ్యాన్స్ గుర్తొచ్చే పాయింట్ ఏంటంటే.. ఆమె నడుం అందాలు.. ప్లస్ నాభి సొగసులు. కానీ మీలో ఉన్న సెక్సఅప్పీల్ ఏంటో చెప్పండి అంటూ రీసెంట్ గా ఈమెకు ఓ ప్రశ్న ఎదురైంది. ఆశ్చర్యకరంగా ఆమె తన కళ్లే తన అట్రాక్షన్ అనేసింది. అదే అందరినీ ఆశ్చర్యపరిచింది. తమ్మూ అంటేనే అందరూ నడుమూ నాభి అనుకుంటుంటే.. తమన్నా ఏంటి కళ్ళు అంటోందనే ఫీలింగ్ చాలామందికి కలిగింది.

కళ్ల అందాలు అంటే అప్పట్లో శ్రీదేవి.. ఆ తర్వాత ఐశ్వర్యారాయ్ వంటి హీరోయిన్స్ మాత్రమే గుర్తొచ్చేవారు. ఇప్పటివరకూ తమన్నా కను మెరుపుల గురించి ఎక్కడా గొప్పగా వినిపించిన దాఖలాలు లేవు. ఇప్పుడు సడెన్ గా తన కళ్లే తనకు అసలు సిసలైన అందం అంటూ తమ్మూ చెప్పుకు రావడంతో.. స్పెషల్ గా ఆమె కళ్ల గురించి జనాలు అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశారు.