Begin typing your search above and press return to search.

బరువు తగ్గితే బెటరేమో బేబీ...

By:  Tupaki Desk   |   7 July 2015 11:15 PM IST
బరువు తగ్గితే బెటరేమో బేబీ...
X
మిల్కీ బ్యూటీ తమన్నా త్వరలోనే యూరప్‌ పయనమవుతోంది. కింగ్‌ నాగార్జున, కార్తీలతో మల్టీస్టారర్‌లో నటించడానికి రెడీ అవుతోంది. అందుకే విదేశాలు వెళ్లే ముందే బాహుబలి ప్రమోషన్‌లో తన బాధ్యతను నెరవేరుస్తోంది. ఓవైపు టీవీ చానెళ్లు మరోవైపు దినపత్రికలు, ఇంకోవైపు వెబ్‌ మీడియా అందరినీ పిలిచి మరీ ఇంటర్వ్యూలు ఇచ్చింది. అలా ప్రమోషన్‌ చేస్తున్నప్పుడు జనాల కళ్లన్నీ ఈ అమ్మడిపైనే వాలిపోయాయి. అయితే మిల్కీ మరింత అందంగా ఉంది గనుకే తనపై దృష్టి సారించారని అనుకోనక్కర్లేదు. అసలు మిల్కీ రూపం ఇలా మారిపోయిందేంటి? అన్న ఆశ్చర్యం వల్లే జనాల కళ్లన్నీ అటు వెళ్లాయి.

మొన్నటికి మొన్న అల్లుడు శీను ప్రమోషన్‌లో ఇంత బొద్దెక్కలేదు. అంతకంటే ముందు ఆవారా, తడాఖా, ఆగడు, వీరుడొక్కడే వంటి సినిమాల్లో మరీ ఇంత లావెక్కిపోలేదు. సన్నగా స్లిమ్ముగానే కనిపించింది. ఉన్నట్టుండి అనూహ్య మార్పు ఇది. బాహుబలి కోసం బరువు పెంచేస్తున్నా అని ప్రకటించింది. ఆ తర్వాత అమాతం 10కేజీల బరువు అదనంగా పెరిగింది. అప్పటి బరువు ఇప్పటికీ తగ్గనేలేదు. బాహుబలి ప్రమోషన్‌లో ఆ తేడా స్పష్టంగా కనబడింది. ఆ ముఖాకృతిలో మార్పొచ్చింది. కోలమొహం కాస్తా చంద్రబింబంలా గుండ్రంగా అయిపోయింది. ప్రభాస్‌, రానా లాంటి భారీకాయులే సినిమా పూర్తవ్వగానే సన్నగా స్లిమ్ముగా అయిపోయారు. తమ్మూ మాత్రం బొద్దుతనం తగ్గించుకోలేదు. ఇలా అయితే ఎలా 'మ్యాడమ్‌'? ఇకనుంచి కుమారి తమన్నా అనకుండా ఆంటీ తమన్నా అనాల్సొస్తుందేమో?