Begin typing your search above and press return to search.

క్వీన్.. చెడగొట్టడంలో మనోళ్ళే బెస్ట్

By:  Tupaki Desk   |   1 Oct 2017 11:31 AM GMT
క్వీన్.. చెడగొట్టడంలో మనోళ్ళే బెస్ట్
X
ఏదన్నా చాలా బాగున్న సినిమాను రీమేక్ చేస్తూ.. దాని ఒరిజినాలిటీలోని ఎసెన్స్ చెడగొట్టేయాలంటే తెలుగు సినిమా మేకర్లే చాలా బెస్ట్ అంటూ ఒక ఆపవాదు ఎప్పటినుండో ఉంది. ఇది అపవాదు కాదు నిజమే అని మనోళ్ళు కూడా ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూనే ఉంటారు. ఈ మధ్యనే వచ్చిన ఒక పెద్ద స్టార్ రీఎంట్రీ సినిమా.. కేవలం ఆ స్టార్ తాలూకు ఫేస్ వాల్యూ వలనే కోట్లు కొల్లగొట్టింది కాని.. ఆ సినిమా తాలూకు ఒరిజినల్ వెర్షన్ లో ఉన్న ఎసెన్స్ అనేది ఇక్కడ ఏ మాత్రం కనిపించలేదు.

కట్ చేస్తే ఇవాళే తమన్నా హీరోయిన్ తెలుగు 'క్వీన్' రీమేక్ మొదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తమన్నా హిందీలో కంగనా రనౌత్ చేసిన పాత్రను చేస్తోంది. అయితే హిందీ వెర్షన్లో కంగనను ఒక సింపుల్ మిడిల్ క్లాస్ అమ్మాయిగా చూపిస్తూ.. సినిమాను కూడా రియలిస్టిక్ లుక్కులోనే చిత్రీకరించారు. కాని తమన్నాతో కూడా తెలుగు 'క్వీన్' పోస్టర్ చూస్తే మాత్రం.. మనోళ్ళు ఒక కమర్షియల్ సినిమా తరహాలో మేకప్పులు మెరుపులూ సోకులూ అద్దేసి.. పోస్టర్లోనే పైత్యాన్ని చూపించేశారు. నీలకంఠ డైరక్షన్లో రూపొందుతున్న ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే.. ఇదేదో జ్యూయలరీ యాడ్ తరహాలోనే ఉంది కాని.. సినిమా పోస్టర్ తరహాలో అస్సలు లేదు.

అయితే తెలుగులో సినిమా కంటెంట్ అయినా రీచ్ అయ్యేలా సరిగ్గా తీస్తారా.. లేదా తమన్నా ఉంది కాబట్టి గ్లామరసం పూర్తిగా దట్టించేసి దానిని మసాలా సినిమా తరహాలో ఒక కిచిడీగా తయరు చేస్తారా? వెయిట్ అండ్ సి.