Begin typing your search above and press return to search.

లిప్ట్ లో కునుకు లాగుతోన్న త‌మ‌న్నా?

By:  Tupaki Desk   |   12 May 2022 12:30 AM GMT
లిప్ట్ లో కునుకు లాగుతోన్న త‌మ‌న్నా?
X
లిప్ట్ లో త‌మ‌న్నా ఏంటి ఇలా ఫోజుచ్చింది? అని ఆ ఫోటో చూస్తేనే సందేహం వ‌స్తుంది. ఫోజులివ్వ‌డానికి ఇంతక‌న్నా గొప్ప లొకేష‌న్ దొర‌క‌లేదా? అనిపిస్తుంది. ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే నెట్టింట మిల్కీ అందం మాత్రం షేకింగ్ త‌ప్ప‌లేదు. త‌మ‌న్నా లిప్ట్ ఫోజు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది. బ్లాక్ క‌ల‌ర్ లో ఒళ్లంతా క‌ప్పేసిన దుస్తుల్లో త‌మ‌న్నా ఎలివేష‌న్స్ ఏం హైలైట్ కాలేదు గానీ.. పాల నురుగుల ఫేస్ మాత్రం అంతే క‌వ్విస్తుంది.

లిప్ట్ వాల్స్ పై రెండు చేతులు వేసుకుని హెడ్ ని కాస్త వొంచి క‌ళ్లు మూసుకుని ఇచ్చిన ఫోజు యువ‌త‌ని ఆక‌ర్షిస్తుంది. ఆహా ఏమి అందం అనుకోవ‌డం నెటి జ‌నుల వంత్తైంది. అదే స‌మ‌యంలో ఫోటో పై ఫ‌న్ని సెట‌ర్స్ ప‌డుతున్నాయి. ఏంటి త‌మ‌న్నా ఇలా లిప్ట్ లో కునుకు లాగుతుంద‌ని కామెంట్లు ప‌డుతున్నాయి. మ‌రి ఆ ఫోజులో అంత కొత్త‌ద‌నం ఏమి? అన్న‌ది తెలుసుకోవాల్సిన సంగ‌తి.

ఇక త‌మ‌న్నా'మాస్ర్టో' త‌ర్వాత మ‌ళ్లీ తెర‌పై క‌నిపించ‌లేదు. నితిన్ స‌ర‌స‌న న‌టించిన ఆ సినిమా పెద్ద‌గా ఆడ‌లేదు. దీంతో ఇప్పుడు స‌క్సెస్ అనివార్య‌మైంది. వాస్త‌వానికి 'ఎఫ్ -2' త‌ర్వాత త‌మ‌న్నా కొన్ని సినిమాల్లో న‌టించింది. కానీ అవేవి అమ్మ‌డికి పెద్ద‌గా క‌లిసి రాలేదు. ఖాళీగా ఉండ‌లేక చేసిన పాత్ర‌ల్లా క‌నిపిస్తాయి త‌ప్ప‌..ఆమె రోల్స్ అంత సీరియ‌స్ గా అనిపించ‌వు.

మ‌ళ్లీ ఇప్పుడు 'ఎఫ్ -2' కి సీక్వెల్ గా తెరకెక్కిన 'ఎఫ్‌-3' తో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతుంది. ఇటీవ‌లే విడుద‌లైన ట్రైల‌ర్ తో అంచనాలు పీక్స్ కి చేరాయి.

త‌మ‌న్నా కూడా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో చురుకుగానే పాల్గొంటుంద‌. చాలా కాలం త‌ర్వాత ఇటీవ‌లే మీడియా ముందుకొచ్చింది. త‌మ‌న్నా అందంలో ఇసుమొత్తు కూడా మార్పు రాలేదు.

స్వీట్ 16 ఇయ‌ర్ గాళ్ గానే క‌నిపిస్తుంది. ఎల్లో క‌ల‌ర్ ఔట్ ఫిట్ లో అటెన్ష‌న్ డ్రా చేసింది. అయితే 'ఎఫ్ -2' ప్రాంచైజీ..'సైరా న‌ర‌సింహారెడ్డి' సినిమా త‌ర్వాత‌ సీనియ‌ర్ హీరోల‌కు ప‌ర్పెక్ట్ ఛాయిస్ గా త‌మ‌న్నా నిలుస్తుంద‌ని చెప్పొచ్చు. ఏదైనా కెరీర్ల మాత్రం స‌క్సెస్ ల‌పై మాత్ర‌మే ఆధార‌ప‌డి ఉంటుంద‌న్నది గ్ర‌హించాల్సిన విష‌యం.