Begin typing your search above and press return to search.

డాక్ట‌రు కాకూడ‌ద‌నే యాక్ట‌రైంది

By:  Tupaki Desk   |   9 Nov 2015 1:00 AM IST
డాక్ట‌రు కాకూడ‌ద‌నే యాక్ట‌రైంది
X
డాక్ట‌రు కాబోయి యాక్ట‌ర్ల‌యిన‌వాళ్లు ఎంద‌రో ఉన్నారు ప‌రిశ్ర‌మ‌లో. డాక్ట‌ర్లు అయ్యాక కూడా యాక్ట‌ర్లు అయిన‌వాళ్లున్నారు. ప్రెస్టేజియ‌స్‌ గా ఎంబీబీఎస్ చ‌దివి డాక్ట‌ర్ ప‌ట్టా అందుకుని అటుపై వృత్తిని వ‌దిలేసి హీరోలుగా సెటిలైన‌వారున్నారు. ఇప్పుడు చీక‌టిరాజ్యం ద‌ర్శ‌కుడు రాజేష్‌.ఎం.సెల్వ కూడా ఎంబిబిఎస్ చ‌దివి ద‌ర్శ‌కుడ‌య్యాడు. అదే కోవ‌లో కాక‌పోయినా కాస్త అటూ ఇటూగా మిల్కీ బ్యూటీ కూడా డాక్ట‌రు కాబోయి యాక్ట‌ర‌య్యింది.

చిన్న‌ప్ప‌ట్నుంచి ఈ అమ్మ‌డి యాంబిష‌న్ వేరు. డాక్ట‌రు - యాక్ట‌రు రెండూ కావాల‌ని అనుకుంది. మిగ‌తా వాళ్ల కంటే కాస్త డిఫ‌రెంటుగా ఆలోచించేదిట అమ్మ‌డు. డాక్ట‌రు అయిపోవాలి. యాక్ట‌రుగానూ గ్లామ‌ర్ ప్ర‌పంచాన్ని ఆక‌ట్టుకోవాలి అని క‌ల‌లు గ‌నేదిట‌. ఎవ‌రు అడిగినా అదే మాట చెప్పేది. అయితే తానోక‌టి త‌లిస్తే విధి వేరొక‌టి త‌ల‌చింది అన్న చందంగా త‌మ్మూ యాక్ట‌రు మాత్ర‌మే అయ్యింది. ఈ విషయాలన్నీ స్వయంగా చెప్పుకొచ్చింది.

అయినా డాక్ట‌రు అంటే ఈజీనా? క‌ప్ప‌ల్ని కొయ్యాలి. బొద్దింక‌ల పొట్ట విప్పాలి. స్పెసిమ‌న్ (చ‌నిపోయిన మ‌నిషి) శ‌రీరం లోప‌ల ఏఏ అవ‌య‌వాలు ఏ తీరుగా ఉన్నాయో క‌ళ్లారా చూడాలి. ట‌చ్ చేయాలి.. ఇదంతా ఉంటుంది. కాబ‌ట్టి త‌మ్మూ అవ‌న్నీ చూడ‌లేకే యాక్ట‌ర‌య్యిందేమో .. అని అంటున్నారు ఎంబీబీఎస్ తెలిసిన బోయ్స్‌!