Begin typing your search above and press return to search.
భయం పోయిందంటున్న బాహుబలి బ్యూటీ
By: Tupaki Desk | 25 Dec 2016 1:00 AM ISTబాహుబలితో బాగా పికప్ అయిన బ్యూటీ తమన్నా భాటియా. ఆ మూవీలో ఏ యాక్టర్.. యాక్ట్రెస్ తో పోల్చినా.. బాహుబలి బాగా ఉపయోగపడింది తమన్నాకే. కేవలం కెరీర్ విషయంలోనే కాదు.. శారీరకంగా.. మానసికంగా ధృడంగా మారేందుకు బాహుబలి యూజ్ అయిందన్న తమ్ము.. బాహుబలి ది కంక్లూజన్ కోసం తాను ఇంకా కొంత షూటింగ్ కంప్లీట్ చేయాల్సి ఉందని.. ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయనున్నానని అంటోంది.
'అవంతిక పాత్ర చేయడం నా జీవితాన్నే మార్చేసింది. ముఖ్యంగా గుర్రపు స్వారీ చేయాల్సి రావడం మొదట భయపెట్టేసింది. గుర్రం నన్ను తీసుకెళుతుందా.. నేను గుర్రాన్ని రైడ్ చేస్తానా అనే డౌట్ ఉండేది. కానీ ట్రైనింగ్ పర్ఫెక్ట్ గా అందడంతో.. ఈ భయాన్ని అధిగమించగలిగాను. ఇది నాకు ఫిజికల్ గా.. మెంటల్ గా బ్యాలెన్సెడ్ గా మారేందుకు సహకరించింది' అని చెబుతోంది మిల్కీ. ఇప్పుడైతే ఏరియల్ షాట్స్ విషయంలోనూ.. రిస్కీ షూట్స్ కోసం కూడా భయపడ్డం లేదట.
ముందు బాగా ప్రాక్టీస్ చేసేసి అనుభవం సంపాదించేస్తే.. భయాలు ఉండవన్నది అమ్మడి వెర్షన్. అభినేత్రి మూవీలో ఓ పాట చేసేందుకు అయితే.. ముందు 15 రోజుల పాటు ప్రాక్టీస్ చేసిందట. ఇక ముంబైలో సినిమాలు చేయడం మొదలుపెట్టక ముందు ఫ్యాషన్ ఇండస్ట్రీ గురించి పెద్దగా తెలియదన్న తమన్నా.. ఆ తర్వాత ఫ్యాషన్ పై దృష్టి పెట్టానని.. ప్రతీసారీ కొత్తగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నానని అంటోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/