Begin typing your search above and press return to search.
తమన్నా... ఏంటీ ఈ వేదాంత దోరణి!
By: Tupaki Desk | 31 Aug 2018 3:52 PM ISTటాలీవుడ్ లో తమన్నా ఎంట్రీ ఇచ్చి పుష్కర కాలం అయ్యింది. కెరీర్ ఆరంభంలో కాస్త తడబడ్డా ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా జోరు ఈమద్య కాస్త తగ్గిందని చెప్పక తప్పదు. తెలుగులో తమన్నా నటిస్తున్న ఒకే ఒక్క చిత్రం ‘క్వీన్’ రీమేక్. ఇక తమిళంలో కూడా ఈమెకు పెద్దగా ఆఫర్లు లేవు. అక్కడ కూడా ఉదయనిధి స్టాలిన్ చిత్రంలో మాత్రమే నటిస్తుంది. ఏ హీరోయిన్ అయినా కొంత కాలంకు ఫేడ్ ఔట్ అవ్వాల్సిందే. ఇదే విషయాన్ని తమన్నా వేదాంత దోరణిలో చెప్పుకొచ్చింది.
తమన్నా తాజాగా సినిమా పరిశ్రమలో 12 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను సినిమా పరిశ్రమలో అడుగు పెట్టి 12 ఏళ్లు అయ్యింది. ఈ సమయంలో నేను ఎన్నో చిత్రాలు చేశాను. చిత్రాల్లో కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా చేశాను, అవి మంచి విజయాన్ని దక్కించుకున్నాయి. మరికొన్ని చిత్రాలను ఎంతో కష్టపడి - ఇష్టపడి చేశాను - కాని అవి మాత్రం గుర్తింపు తీసుకు రాలేదు. హిందీలో నేను కొన్ని సినిమాలు చేశాను - కాని అవి నాకు అక్కడ గుర్తింపును తీసుకురాలేదు. కాని తెలుగులో చేసిన ‘బాహుబలి’ చిత్రం హిందీలో డబ్ అయ్యి విజయాన్ని దక్కించుకోవడంతో బాలీవుడ్ లో గుర్తింపు వచ్చిందని చెప్పుకొచ్చింది.
సినిమా పరిశ్రమలో ఊహించనివి జరుగుతాయి - ఊహించినవి జరగాలని లేదు. ఇండస్ట్రీలో పేరు - డబ్బు సంపాదించడం సులభం - కాని అందుకు సమయం రావాలి. ఆ సమయం కొందరికి వస్తుంది - కొందరికి రాదు అంటూ తమన్నా వేదాంత దోరణిలో మాట్లాడటం జరిగింది. సినిమాల్లో ఆఫర్లు లేనప్పుడే ఇలాంటి వేదాంత దోరణి మాటలు హీరోయిన్స్ నుండి వస్తాయి. తమన్నా పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉందని ఫిల్మ్ నగర్ జనాలు అనుకుంటున్నారు.