Begin typing your search above and press return to search.

ఆడియోకి రానున్న తమ్మూ ఆత్మ!!

By:  Tupaki Desk   |   1 March 2016 2:50 PM IST
ఆడియోకి రానున్న తమ్మూ ఆత్మ!!
X
నాగార్జున - కార్తీల మల్టీ స్టారర్ మూవీలో తమ్మూ లీడ్ రోల్ లో నటించింది. ఈ నెల 25న విడుదల కానున్న ఈ మూవీ ఆడియో ఫంక్షన్ జరగనుండగా.. ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నానంటూ మిల్కీ బ్యూటీ తమన్నా ట్వీట్ చేసింది. అయితే.. ఓ ఎఫ్ ఎం స్టేషన్ లో పాట విడుదల చేసేందుకు హాజరు కావడం మాత్రం రావడం విశేషం.

నాగ్ - కార్తీలతో కలిసి నటించడం జీవితంలో ఎన్నో అనుభూతులను మిగిల్చిందన్న తమన్నా.. ఎఫ్ ఎం శ్రోతలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ఊపిరిలో తన కేరక్టర్ విభిన్నంగా ఉంటుందని చెప్పింది. షూటింగ్ సమయంలో జరిగిన చాలా సంఘటనలను గుర్తు చేసుకుంది తమన్నా. అయితే.. ఊపిరి ఆడియో ఫంక్షన్ కు హాజరు కాలేకపోతున్నానంటూ.. ట్విట్టర్ లో చెప్పింది మిల్కీ. 'ప్రస్తుతం నేను ధర్మదురై షూటింగ్ లో ఉన్నాను. అందుకే ఊపిరి ఆడియో వేడుకకు హాజరు కాలేకపోతున్నాను. ఈ సినిమా నా హృదయానికి ఎంతో దగ్గరైన మూవీ. ఈ సినిమా షూటింగ్ లో ప్రతీ క్షణాన్ని నేను ఎంజాయ్ చేశాను. ఆడియో ఫంక్షన్ కు నేను శారీరకంగా హాజరుకాలేకపోయినా.. నా ఆత్మ మాత్రం ఆ టీంతో ఎప్పుడూ ఉంటుంది' అని ట్వీట్ చేసింది తమన్నా.

ఈ సినిమా తమిళ వెర్షన్ తోఝా ఆడియో రిలీజ్ కి మాత్రం చక్కగా ముస్తాబై క్లీవేజ్ షో చేస్తూ హాజరైన తమ్మూ.. తెలుగు వెర్షన్ కి రాలేకపోతున్నానని చెప్పడం.. ఆశ్చర్యకరమైన విషయం.