Begin typing your search above and press return to search.

మహానటి ఫస్ట్ ఛాయిస్ కాదట!

By:  Tupaki Desk   |   10 Jan 2019 4:36 PM GMT
మహానటి ఫస్ట్ ఛాయిస్ కాదట!
X
లేడీ ఓరియెంటెడ్ సినిమాలు రెండు రకాల హీరోయిన్లు చేస్తారు. వారిలో మొదటిరకం మంచి స్టార్ ఇమేజ్ ఉన్న బ్యూటీలు.. రెండో రకం ఫేడ్ అవుట్ కావడానికి రెడీగా ఉన్నవారు. ఏదేమైనా లేడి ఓరియెంటెడ్ సినిమాలలో నటించి క్రౌడ్ పుల్లర్ గా నిలవడం సాధారణ విషయం మాత్రం కాదు. నయనతార.. అనుష్క లాంటి హీరోయిన్లు ఇలాంటి సినిమాలకు పర్మనెంట్ అడ్రెస్. తమన్నా.. కాజల్ లాంటి హీరోయిన్లు కూడా అడపాదడపా ఇలాంటి సినిమాలను ఒప్పుకుంటూ ఉంటారు. రీసెంట్ గా ఈ లిస్టులో మహానటి కీర్తి సురేష్ కూడా జాయిన్ అయింది.

ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ వారు నిర్మించే తాజా చిత్రంలో కీర్తి సురేష్ ప్రధానపాత్రలో నటిస్తోంది. నూతన దర్శకుడు నరేంద్ర రూపొందించనున్న ఈ సినిమాకు ఈరోజే పూజా కార్యక్రమాలు జారిగాయి. ఈ లాంచ్ ఈవెంట్ కు నందమూరి కళ్యాణ్ రామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సినిమా కథ ప్రకారం మెజారిటీ భాగం షూటింగ్ అమెరికా లో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతారని సమాచారం.

ఈ సినిమా గురించి మరో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ సినిమా నిజానికి మిల్కీ బ్యూటీ చేయాల్సి ఉందట. దర్శకుడు మొదట తమన్నాకు కథ వినిపించి ఆమెను ఒప్పించాడట. కానీ తమన్నా ఇతర కమిట్మెంట్స్ తో బిజీగా ఉండడంతో దర్శక నిర్మాతలు కీర్తి సురేష్ ను సంప్రదించారట. సో.. మిల్కీ బ్యూటీ చేయాల్సిన సినిమా మహానటి చేస్తోందన్నమాట.