Begin typing your search above and press return to search.

తమన్నా అసలు రంగు బయటేశారు

By:  Tupaki Desk   |   15 July 2015 7:13 PM IST
తమన్నా అసలు రంగు బయటేశారు
X
తమన్నా. మిల్కీ బ్యూటి అని ఆడియన్స్‌ ప్రేమగా పిలుస్తారు కాని, బాలీవుడ్‌లో మిల్కీ అని పిలువగానే హబ్బా అంటూ కాస్త విసుక్కుంది అమ్మడు. కాని బాలీవుడ్‌లో డోర్స్‌ అన్నీ క్లోజ్‌ అయిపోవడంతో ఇప్పుడు మళ్లీ తిరిగి టాలీవుడ్‌లోనే వెతుక్కుంటోంది. కట్‌ చేస్తే బాహుబలి సినిమాతో బీభత్సమైన హిట్టు కొట్టేసింది. అయితే ఈ సినిమాలో అమ్మడు తన మిల్కీ లుక్‌తో మ్యాజిక్‌ చేసిందా లేదా?

ఏదో ఒక పాటలో బ్యాక్‌లెస్‌ సీన్లో కూడా కనిపించి ఊరించింది కాని, అసలు తమన్నా మిల్కీ లుక్‌ అనేది కనిపించలేదు పెద్దగా. ఆమె పూర్తిగా ట్యాన్‌ తో పేరుకుపోయిన లుక్‌లోనే ఓ రెబెల్‌గా అలరించింది. యువరాణి అవంతికి అని పేరుకే కాని, బాహుబలి లోపల మాత్రం సైనికురాలు అవంతిక అన్నంతలా తమన్నా మేకప్‌ను మార్చేశాడు రాజమౌళి. అయితే ఇన్నాళ్లూ ఆమె లేలేత పాల అందాలను ప్రమోట్‌ చేస్తూ పోస్టర్లు వేయించిన మేకర్లు ఇప్పుడు తమన్నా డార్క్‌ కలర్‌ కనపించేలా కొత్త పోస్టర్లు బయటేశారు. ఆ విధంగా సినిమాలోని ఆమె అసలు రంగులను దించేశారు. ఈ పోస్టర్లు చూడ్డానికి బాగున్నాయి.

ఇకపోతే బాహుబలి సినిమా నిన్నటితో 215 కోట్లు గ్రాస్‌ వసూలు చేసింది. కలెక్షన్లు కాస్త తగ్గినా సినిమా స్టెడీగానే దూసుకుపోతోంది. ఖచ్చితంగా ఓ 280 కోట్లు గ్రాస్‌ వసూలు చేయడం గ్యారంటీ అంటున్నారు ట్రేడ్‌ పండితులు. అది సంగతి.