Begin typing your search above and press return to search.

ఇన్నాళ్లకు తమన్నా నేర్చుకుంటోంది

By:  Tupaki Desk   |   29 May 2018 4:14 AM GMT
ఇన్నాళ్లకు తమన్నా నేర్చుకుంటోంది
X
మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు దాటిపోతోంది. కెరీర్ లో అత్యధికంగా గ్లామర్ రోల్స్.. కమర్షియల్ మూవీలే ఎక్కువగా చేయడంతో పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. తెలుగుతోపాటు తమిళం సినిమాల్లోనూ మిల్కీ బ్యూటీ పాపులరైన తమన్నాకు హీరోలతో ఆడిపాడటమే తప్ప ఛాలెంజింగ్ రోల్స్ ఎదురవలేదు.

బాహుబలి సినిమాలో అవంతిక పాత్రలో యోధురాలి పాత్ర చేసినా అలా కొద్దిసేపే కనిపిస్తుంది. అందులోనూ గ్లామర్ డాల్ గానే ఆకట్టుకుంది. కానీ బాహుబలి మూవీ అవంతిక పాత్రలో ఆమె నటన నచ్చి మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా సైరా నరసింహారెడ్డిలో ఆమెకు ఛాన్స్ ఇచ్చారు. ఈ మూవీలో హీరోయిన్ గా నయనతార నటిస్తోంది. ఇందులో ఇంకో ఇంపార్టెంట్ రోల్ కు తమన్నాను తీసుకున్నారు. తాజాగా సైరా సినిమా కోసం తమన్నా భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఇంతవరకు కెరీర్ లో ఇలా క్లాసికల్ డ్యాన్స్ ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర రాకపోవడంతో ఆమెకు నేర్చుకోవాల్సిన అవసరమే పడలేదు. ఇప్పుడు సైరా కోసం కష్టపడి నాట్యం నేర్చుకుంటోంది.

దీంతోపాటు తమన్నా బాలీవుడ్ హిట్ మూవీ క్వీన్ తమిళ్ రీమేక్ లో హీరోయిన్ గా చేస్తోంది. ఇది పూర్తిగా హీరోయిన్ ఓరియంటెడ్ ఫిలిం. ఇలా కెరీర్ లో ఒకేసారి రెండు ఛాలెంజింగ్ రోల్స్ రావడంతో వాటిలో పర్ ఫెక్ట్ అనిపించుకుని పేరు తెచ్చుకోలని ఆశపడుతోంది. సైరా తరవాత షెడ్యూల్ లో తమన్నా డ్యాన్స్ చేస్తున్న సీన్లు షూట్ చేయబోతున్నారు. ఈలోగా నాట్యం నేర్చుకోవడానికి కష్టపడి సాధన చేస్తోంది.