Begin typing your search above and press return to search.

బాలీవుడ్ ఫ్యాష‌నిస్టాల‌కే మ‌తిచెడే ట్రీటిచ్చిన మిల్కీ

By:  Tupaki Desk   |   5 March 2021 4:09 PM IST
బాలీవుడ్ ఫ్యాష‌నిస్టాల‌కే మ‌తిచెడే ట్రీటిచ్చిన మిల్కీ
X
రొటీన్ గా ఉంటే ప‌ట్టించుకునేదెవ‌రు? పైగా అల్ట్రా మోడ్ర‌న్ ఫ్యాష‌నిష్టా ప్ర‌పంచంలో రంగుల మాయావ‌నంలో సంచ‌రించేప్పుడు కాస్త‌యినా క్రియేటివిటీ కంటెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇదిగో మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నాను చూస్తే ఆ మాట మీరే అంగీక‌రిస్తారు.ఇలాంటి ఫ్యాష‌న్ లు బాలీవుడ్ వాళ్ల‌కే చెల్లింది అనుకుంటే పొర‌పాటే! అనిపించేలా మిల్కీ వైట్ బ్యూటీ చెల‌రేగిపోయింది. ఇదిగో ఇలా లూజ్ స్టైల్లో ఫుల్ బోల్డ్ లుక్ లో క‌నిపించి హీటెక్కించింది.

అస‌లిదంతా దేనికి మిల్కీ..ఏంటీ డ‌ఫ్ఫా జ‌ఫ్ఫా బోల్డ్ స్టైల్? అంటూ యూత్ ఒక‌టే కామెంట్లు చేస్తున్నారు. ఆ బెల్ బాట‌మ్ లూజ్ బ్లూ జీన్స్.. దానిపైనా టాప్ కూడా అంతే లూజ్ బ్లూ జీన్స్ ష‌ర్ట్ ... వ్వావ్ సంథింగ్ అవే అనిపించేలా క‌నిపిస్తోంది. పూర్తిగా డిఫ‌రెంట్ టోన్ తో క‌నిపిస్తోంది త‌మ‌న్నా. నిన్న‌నే క‌రీనా క‌పూర్ ఖాన్ పార్టీలో బాలీవుడ్ పూల‌రంగ‌డు క‌ర‌ణ్ జోహార్ పేప‌ర్ మ్యాన్ లుక్ లో లూజ్ డ్రెస్ లుక్ లోనూ క‌నిపించాడు. ఆ ఫోటోల్ని నెటిజ‌నులు ఒక రేంజులోనే ట్రోల్ చేశారు. ఇంత‌లోనే త‌మ‌న్నా కూడా ఇంచుమించు అలానే కొత్త‌గా ట్రై చేసింది. దీనికి యూత్ కామెంట్లు అంతే వేడెక్కిపోతున్నాయ్.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే..తమన్నా మొదటి తెలుగు వెబ్ సిరీస్ లెవెంథ్ అవ‌ర్ (11వ గంట) OTT ప్లాట్ ఫాం కోసం సిద్ధ‌మైన‌ది. తమిళ సిరీస్ `నవంబర్ స్టోరీ`తో OTT అరంగేట్రం చేసిన తరువాత ఇది తమన్నా కు రెండవ వెబ్ సిరీస్. ఇదేగాక‌.. గోపిచంద్ - తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన స్పోర్ట్స్ డ్రామా సిటీమార్ రిలీజ్ కి రావాల్సి ఉంది. ఎఫ్ 3 స‌హా అంధాధున్ రీమేక్ లోనూ త‌మ‌న్నా న‌టిస్తోంది. బోలే చుడియాన్ బాలీవుడ్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి రిలీజ్ అప్ డేట్ కూడా రావాల్సి ఉంది.