Begin typing your search above and press return to search.

‘నాన్నకు ప్రేమతో’లో తమన్నా!

By:  Tupaki Desk   |   8 Dec 2015 5:00 PM IST
‘నాన్నకు ప్రేమతో’లో తమన్నా!
X
సుకుమార్ సినిమా అనగానే అందులో ఓ ఐటెం సాంగ్ మాండేటరీ. ‘1 నేనొక్కడినే’ లాంటి థ్రిల్లర్ మూవీలో సైతం ఐటెం సాంగ్ అలవాటును వదిలిపెట్టలేదు సుక్కు. ఐటెం సాంగ్స్ స్పెషలిస్టయిన దేవిశ్రీ ప్రసాద్.. తన ఫేవరెట్ డైరెక్టర్ కోసం ఇంకా శ్రద్ధ పెట్టి పాటలు చేస్తుంటాడు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో రాబోయే కొత్త సినిమా ‘నాన్నకు ప్రేమతో’లో కూడా అదిరిపోయే ఐటెం సాంగ్ ఒకటి ఉండబోతోందట. ఇంతకీ ఆ పాటలో డ్యాన్స్ చేసే అమ్మాయి ఎవరని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటిదాకా సుక్కు ఐటెం సాంగ్స్‌ లో హీరోయిన్లెవరూ డ్యాన్స్ చేసింది లేదు. ఐతే తొలిసారి ఓ హీరోయిన్ తో స్టెప్పులేయిస్తున్నాడట సుక్కు. ఆ హీరోయిన్ తమన్నానే అని సమాచారం.

తమన్నా ఇప్పటికే ‘అల్లుడు శీను’లో నా ఒంటి పేరు సిల్కు అనే ఐటెం సాంగ్ లో అదరగొట్టింది. మళ్లీ బెల్లంకొండ శీనుతోనే ఇంకో పాటకు డ్యాన్స్ చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్ పక్కనే ఐటెం సాంగ్ చేయబోతోందంటే విశేషమే. ఇద్దరూ మంచి డ్యాన్సర్లే కాబట్టి.. దేవిశ్రీ మాంచి బీటున్న పాటిస్తే డ్యాన్స్ ఫ్లోర్ హీటెక్కిపోవడం ఖాయం. ప్రస్తుతం ‘నాన్నకు ప్రేమతో’ టీం స్పెయిన్ షెడ్యూల్లో ఉంది. ఈ నెల 20 తర్వాత హైదరాబాద్ వస్తుది. 23న ఆడియో అంటున్నారు. ఆ తర్వాతే ఈ ఐటెం సాంగ్ చిత్రీకరణ ఉండొచ్చని అంటున్నారు. మరి ఈ పాట షూట్ చేసి సంక్రాంతికల్లా సినిమాను రెడీ చేయగలరా?