Begin typing your search above and press return to search.

వీడియో: జ్వాలారెడ్డికి మాస్ విజిల్స్ గ్యారెంటీ

By:  Tupaki Desk   |   9 Sep 2021 5:31 AM GMT
వీడియో:  జ్వాలారెడ్డికి మాస్ విజిల్స్ గ్యారెంటీ
X
యాక్ష‌న్ హీరో గోపిచంద్ నటించిన `సీటీమార్` రిలీజ్ కి సిద్ధ‌మవుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా జ్వాలారెడ్డిగా ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. తొలి నుంచి ఈ మూవీలో త‌మ‌న్నా పాత్ర‌పైనే అంద‌రి దృష్టి. గోపీచంద్ తో పోటీప‌డుతూ మిల్కీ పాత్ర‌ను ద‌ర్శ‌కుడు హైలైట్ చేయ‌డం విశేషం. ఇంత‌కుముందే జ్వాలారెడ్డి టీజింగ్ సాంగ్ అల‌రించింది. తాజాగా సీటీ మార్ నుంచి జ్వాలారెడ్డి పూర్తి పాట‌ విడుద‌లైంది. ఇందులో గోపీచంద్ - తమన్నా జంట అద్భుత నృత్యాల‌తో అద‌ర‌గొట్టారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ఈ పాట‌ను విడుద‌ల చేయ‌గా గ్యాల‌రీ విజిల్స్ తో హోరెత్తింది.

జానపద సెట‌ప్ తో అద్భుత‌మైన నృత్యాల‌తో క‌ల‌ర్ ఫుల్ విజువ‌లైజేష‌న్ ఈ పాట‌కు ప్ర‌ధాన బ‌లం. నామ్ హై జ్వాలారెడ్డి.. నికాల్ దూంగ సబ్ కా హ‌డ్డీ..!! అంటూ ఫైర్ బ్రాండ్ గా త‌మ‌న్నా ఈ చిత్రంలో క‌నిపించ‌నుంది. పేరు జ్వాలారెడ్డి.. క‌బ‌డ్డీ కోచ్.. తెలంగాణ‌లో రెడ్డి గారు మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్.. ఎదురుప‌డితే అంతే సంగతి.. ఎంత‌టి మొన‌గాడైనా ఆగాల్సిందే మ‌రి. ట‌న్ను లోడ్ తో హెవీ డ్యూటీ లారీని అయినా న‌డిపేంత ట్యాలెంట్ మిసెస్ జ్వాలారెడ్డికి ఉంది. మ‌రి అలాంటి ప‌వ‌ర్ ఫుల్ లేడీతో పెట్టుకున్న సామాన్య క‌బ‌డ్డీ కోచ్ గోపిచంద్ ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది తెర‌పైనే చూడాలి. సీటీమార్ సినిమా ఆద్యంతం గోపిచంద్- త‌మ‌న్నా న‌డుమ స‌న్నివేశాలు ర‌క్తి క‌ట్టిస్తాయ‌ని ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది చెబుతున్నారు.

ఈ చిత్రంలో హిప్పీ ఫేం దిగంగ‌న సూర్య‌వంశీ- భూమిక - రెహ‌మాన్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 2న సీటీమార్ రిలీజ్ కావాల్సి ఉండ‌గా సెకండ్ వేవ్ వ‌ల్ల వాయిదా ప‌డింది. సీటీమార్ కి సంపత్ నంది దర్శకత్వం వహించారు. అత‌డే ర‌చ‌యిత కూడా. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది సెప్టెంబర్ 10 న వినాయక చతుర్థి నాడు విడుదల కానుంది.