Begin typing your search above and press return to search.

శీతాకాలాన్ని భ‌గ‌భ‌గ మరిగిస్తున్న మిల్కీ

By:  Tupaki Desk   |   10 Jun 2022 4:16 AM GMT
శీతాకాలాన్ని భ‌గ‌భ‌గ మరిగిస్తున్న మిల్కీ
X
'గుర్తుందా శీతాకాలం..' అంటూ కుర్ర‌కారును మ‌రిగించేందుకు వ‌స్తోంది మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా. హాట్ స‌మ్మ‌ర్ లో కూల్ రొమాన్స్ తో అద‌ర‌గొట్టేందుకు త‌న‌కేమీ అభ్యంత‌రం లేద‌ని అంటోంది. ఇంత‌కీ త‌మ‌న్నా రొమాన్స్ చేస్తోంది ఎవ‌రితో? అంటే జ్యోతిల‌క్ష్మి ఫేం స‌త్య‌దేవ్ తో.

త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌చారం ఒక రేంజులో ఊపందుకుంది. చిత్ర‌బృందం నిరంత‌రం వేడెక్కించే రొమాంటిక్ ఫోటోల‌తో ప్ర‌చారంలో హైప్ తెస్తోంది. తాజాగా నాయకానాయిక‌ల ప‌బ్లిక్ రొమాన్స్ కి సంబంధించిన ఓ ఫోటోగ్రాఫ్ ని షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది. ఇందులో ప‌సుపు రంగు స్కూటీ పెప్ పై ప్రేమ జంట ఎంతో ముచ్చ‌ట‌గా క‌నిపిస్తోంది. త‌మ‌న్నా స్వెట్ ష‌ర్ట్ పొట్టి డెనిమ్ ధ‌రించి అలా రొమాంటిగ్గా డ్రైవ్ చేస్తూ స్మైలీ లుక్ తో వెళుతోంది. ఇక త‌న వెన‌క సీట్ లో కూచున్న స‌త్య‌దేవ్ గాల్లో తేలిన‌ట్టుందే..! అంటూ ఎంతో రొమాంటిక్ మూడ్ తో క‌నిపిస్తున్నాడు. అస‌లే మిల్కీ అందం.. ఆపై పొట్టి నిక్క‌రులో థై హాట్ సొగ‌సుల‌ను ఎలివేట్ చేస్తూ క‌నిపించేస‌రికి యువ‌త‌రం ఈ ఫోటోగ్రాఫ్ పై హాట్ కామెంట్లు చేస్తున్నారు.

మొత్తానికి ఈ స‌మ్మ‌ర్ లో మ‌రింత అగ్గి రాజేస్తూ త‌మ‌న్నా చేస్తున్న హ‌డావుడి అంతా ఇంతా కాదు. శీతాకాలం అంటూనే స‌మ్మ‌ర్ హీట్ ని రాజేస్తోంది. కుర్ర‌హీరో కూడా దానిని అదే ప‌నిగా ఫాలో అయిపోతున్నాడు.

స‌త్య‌దేవ్- తమన్నా భాటియా జంట‌గా నటించిన 'గుర్తుందా సీతకాలం' రిలీజ్ డేట్ తాజాగా లాక్ అయ్యింది. జూలై 15న సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. నాగశేఖర్ ఆర్ దర్శకత్వంలో భావన రవి- నాగశేఖర్ -రామారావు చింతపల్లి నిర్మించారు. కన్నడ హిట్ చిత్రం లవ్ మాక్ టైల్ కి అధికారిక తెలుగు రీమేక్ ఇది. ఇంత‌కుముందు విడుద‌లైన ట్రైలర్ కూల్ అండ్ లవ్లీ యాంబియెన్స్ తో ఆక‌ట్టుకుంది.

సత్య దేవ్ పాత్ర ఆస‌క్తిక‌రం. ఈ చిత్రంలో వివిధ దశలలో భిన్న‌మైన ప్రేమకథల‌ను న‌డిపించే కుర్రాడిగా అత‌డు క‌నిపిస్తాడు. ఆశ్చర్యకరంగా అతడు నటించిన‌ ప్రతి ప్రేమకథ శీతాకాలంతో ముడిపడి ఉంటుంది. ఈ చిత్రంలో తమన్నా భాటియా- మేఘా ఆకాష్- కావ్య శెట్టి లాంటి టాప్ క్లాస్ హీరోయిన్ల‌తో అత‌డు రొమాన్స్ చేయ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. భామ‌ల‌తో ప్రేమలో ప‌డే కుర్రాడిగా స‌త్య‌దేవ్ క‌నిపించ‌నున్నారు. కాల భైరవ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. సత్య హెగ్డే రిచ్ విజువల్స్ .. లక్ష్మీ భూపాల డైలాగ్స్ ఈ సినిమాకి ప్ల‌స్ కానున్నాయి.

అగ్గి రాజేస్తున్న స‌మ్మ‌ర్ లో గుర్తుందా శీతాకాలం అంటూ స‌త్య‌దేవ్ అండ్ టీమ్ ప‌ల‌క‌రింపు ఆశ్చ‌ర్యం క‌లిగించేదే. ప్రేమించిన యువ‌తిలో నిజమైన ప్రేమను కనుగొనడం కోసం సాగించే ప్ర‌యాణంలో అనేక సార్లు హార్ట్ బ్రేక్ అయ్యే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రయాణానికి సంబంధించిన క‌థ ఇది. టైటిల్ కి త‌గ్గ‌ట్టే క‌థాంశం క్యూరియ‌స్ గా సాగుతుంది. పూర్తి స్థాయి రొమాంటిక్ లవ్ ఎంట‌ర్ టైన‌ర్ ఇది. త‌మ‌న్నా లాంటి సీనియ‌ర్ న‌టితో స‌త్య‌దేవ్ రొమాన్స్ ఎలా ఉండ‌నుందో తెరపైనే చూడాలి. ఈ చిత్రంలో సుహాసిని మణిరత్నం ఓ కీల‌క పాత్ర‌లో నటించారు. మేఘా ఆకాష్ అతిధి పాత్రలో కనిపించనుందని సమాచారం.

ట్రైల‌ర్ స‌హా విజువ‌ల్స్ కి ఇప్ప‌టికే అద్భుత స్పంద‌న వ‌చ్చింది. శ్రీ వేదాక్షర మూవీస్ సహకారంతో నాగశేఖర్ మూవీ- మణికంఠ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ల‌పై భావన రవి- నాగశేఖర్-రామారావు చింతపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జ్యోతి లక్ష్మి- బ్లఫ్ మాస్టర్- బ్రోచేవారెవరురా- ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య చిత్రాల‌తో న‌టుడిగా నిరూపించిన స‌త్య‌దేవ్ ఈ సినిమాతో పాటు గాడ్సే చిత్రంలోనూ న‌టిస్తున్నారు. హిందీ చిత్రం రామ్ సేతులోను న‌టిస్తున్నాడు. అలాగే మెగాస్టార్ గాడ్ ఫాదర్ లో కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నాడు. మ‌రోవైపు తమన్నా న‌టించిన‌ F3 ఇటీవ‌లే విడుద‌లై విజ‌యం అందుకుంది. బోలే చుడియాన్- ప్లాన్ ఎ ప్లాన్ బి- భోలా శంకర్ చిత్రాల్లోనూ న‌టిస్తోంది.