Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: ఏంజెల్ ఇన్ బ్లూ డ్రెస్

By:  Tupaki Desk   |   13 July 2019 1:15 PM GMT
ఫోటో స్టొరీ: ఏంజెల్ ఇన్ బ్లూ డ్రెస్
X
కొత్త హీరోయిన్ గురించి అయితే పరిచయం చేయాల్సి వస్తుంది కానీ తమన్నా భాటియా గురించి తెలుగువారికి ప్రత్యేకంగా ఇంట్రో ఇవ్వాల్సిన పని లేదు కదా. అసలే చిక్కటి పాలరంగులో ఉండే భామ కావడం తో మిల్కీ బ్యూటీ అనే టైటిల్ కూడా ఇచ్చారు. తమన్నా ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం దాటిపోయింది. అయినా ఇంకా చెప్పుకోదగ్గ ఆఫర్లతో హీరోయిన్ గా కొనసాగుతోంది. అంతే కాదు ఈ జెనరేషన్ హీరోయిన్ల లాగానే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ట్విట్టర్ లో దాదాపు నాలుగు మిలియన్లు ఇన్స్టాలో ఎనిమిది మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు.

అందుకే వారందరినీ మురిపిస్తూ అందమైన ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి ఒక ఫోటో షూట్ చేసి.. ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా పంచుకుంది. ఈ ఫోటోలకు "బోలె చూడియా కాన్ఫరెన్స్ కోసం" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. తమన్నా ప్రస్తుతం నవాజుద్దిన్ సిద్ధిఖి హీరోగా నటిస్తున్న 'బోలె చూడియా' అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఆ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ కోసం ఇలా తయారయిందట. బ్లూ కలర్ డ్రెస్ లో బుట్టబొమ్మలాగా కనిపిస్తోంది. లూజ్ హెయిర్.. చెవులకు అందమైన హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్.. ఒక చేతికి మాత్రమే బ్యాంగిల్స్ ధరించి సూపర్ స్టైలిష్ గా ఉంది. మేకప్.. లిప్ స్టిక్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. సహజంగా బాలీవుడ్ భామలు ఫోటో షూట్స్ అంటే చాలు అందాల వడ్డన.. చీరలను ఆరేసుకోవడం లాంటివి చేస్తుంటారు. కానీ తమన్నా మాత్రం అదంతా లేకుండా.. స్కిన్ షో ఏమాత్రం చేయకుండా తన అందంతో మెస్మరైజ్ చేస్తోంది.

ఈ ఫోటోలకు నెటిజన్లు సూపర్ కామెంట్లు పెట్టారు. "వెరీ వెరీ బ్యూటిఫుల్".. "ఏ డ్రెస్సు వేసుకున్నా నువ్వు సూపర్ తమ్మూ".. "ఏంజెల్ ఇన్ బ్లూ డ్రెస్".. "సో క్యూట్.. ప్రెట్టియస్ట్ డ్రెస్".. "స్వీటెస్ట్ డ్రెస్ లో స్వీట్ హార్ట్" అంటూ క్యాప్షన్స్ ఇచ్చారు. ఇక తమన్నా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే తెలుగులో 'సైరా'.. 'దట్ ఈజ్ మహాలక్ష్మి'.. తమిళంలో విశాల్-సుందర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో. నటిస్తోంది. 'ఆనందో బ్రహ్మ' తమిళ రీమేక్ లో కూడా నటిస్తోంది.