Begin typing your search above and press return to search.
బాహుబలి ఫస్ట్ షో టాక్: మిల్కీ దేవతే
By: Tupaki Desk | 10 July 2015 9:45 AM ISTనిజానికి సినిమా ఏదైనా కూడా.. కమర్షియల్ ఎలిమెంట్స్ జతచేయడం అంటే.. అది రాజమౌళి తరువాతే. ఈ సినిమాలో మిల్కీ బ్యూటి తమన్నా ఫస్టాప్‌లో కావల్సినంత ఆ క్యూట్ గ్లామర్‌ను యాడ్ చేసేసింది. గతంలో ఈ పాత్రకు సమంత, శృతిహాసన్‌ను జక్కన్న సంప్రదించాడు కాని, వాళ్ళకంటే మిల్కీ హొయలే ఈ పాత్రకు సరిగ్గా సెట్టవుతాయని సినిమా చూస్తే తెలుస్తుంది.
అసలు ఏదో ఒక గ్లామర్ క్వీన్‌లా ఎంట్రీ ఇచ్చిన తమన్నా.. సినిమాలో వారియర్‌గా ఇరగదీసింది. ఈమె ప్రిన్సెస్ అవంతిక అని ఎక్కడా చెప్పలేదు కాని, కేవలం అవంతికగా మాత్రం కత్తితో యుద్దం చేయడం, బాణాలు వేయడం, శత్రువుల పీకపై కత్తిపెట్టి వారిని చంపేయడం వంటి ఫీట్లు చేసింది. అవన్నీ చాలా ఇంప్రెసివ్‌గా ఉన్నాయ్. ఇక ధీవరా అనే పాటలో ఒక దేవకన్యలా మిరుమిట్లుగొలిపిన తమ్మూ.. ఆ తరువాత పచ్చబొట్టేసినా అనే పాటలో స్వర్గపుతోటలో పురివిప్పి నాట్యం చేసి ఓ రసికశికామణిలా ఉంది. అంతేకాదు, ఆమె పాలనురుగు అందాలు ప్రభాస్‌ను సైతం పక్కకునెట్టేసి విపరీతంగా ఊరించేశాయి.
నిజంగానే ఓ గ్లామరసం ఆరబోసిన దేవతలా ఉంది తమన్నా. కాకపోతే ఆమె రోల్‌కు కథలో ప్రాముఖ్యత ఏంటనేది ఫస్ట్ పార్టు చూస్తే మాత్రం తెలియదు. రెండో పార్టులో ఏమి చూపిస్తారో మరి...