Begin typing your search above and press return to search.

మిల్కీ బ్యూటీకి భలే రీమేక్ దొరికిందే

By:  Tupaki Desk   |   5 Jun 2019 11:55 AM IST
మిల్కీ బ్యూటీకి భలే రీమేక్ దొరికిందే
X
మొన్నటిదాకా కాస్త డల్ గా ఉన్న మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ కి జనవరిలో వచ్చిన ఎఫ్2 బ్లాక్ బస్టర్ మంచి ఉత్సాహన్ని ఇచ్చింది. వెంకటేష్ లాంటి సీనియర్ హీరోతో చేసినా అవకాశాలు తగ్గిన తరుణంలో ఇదే గొప్ప ఊరట అనుకోవాలి. అందుకే ఇదే జోష్ ని కంటిన్యూ చేస్తూ వరసబెట్టి సినిమాలు చేస్తోంది. సైరా అక్టోబర్ 2 రావడం దాదాపు ఖరారు కాబట్టి అది తనకు మరో పెద్ద బ్రేక్ అవుతుందనే అంచనాలో ఉంది తమన్నా.

మూడేళ్ళ క్రితం వచ్చిన అభినేత్రితో హారర్ వైపు దృష్టి మళ్లించిన తమ్ము ఇటీవలే వచ్చిన దాని సీక్వెల్ తో పెద్ద షాకే తింది. ఇంత దారుణమైన ఫీడ్ బ్యాక్ ఏ సినిమాకు రానంత ఘోరంగా మూడు రాష్ట్రాల్లో డిజాస్టర్ గా నిలిచింది. గ్లామర్ షో చేసినా ప్రభుదేవా లాంటి డాన్సింగ్ స్టార్ కు జంటగా చేసినా అవేవి ఫెయిల్యూర్ ని ఆపలేకపోయాయి. ఇదిలా ఉండగా తమన్నా ఇప్పుడు మరో హారర్ కామెడీకి రెడీ అవుతోంది

రెండేళ్ల క్రితం వచ్చిన ఆనందో బ్రహ్మ తెలుగులో మంచి హిట్ కొట్టిన సంగీతం తెలిసిందే. ఈ ఏడాది యాత్రతో అందరి మనసులు గెలుచుకున్న యాత్ర దర్శకుడు మహి రాఘవ రూపొందించిన ఆ మూవీ త్వరలో తమిళ్ లో రీమేక్ కాబోతోంది. తాప్సీ పాత్రను తమన్నా చేయబోతోంది. మిగిలిన స్టార్ క్యాస్ట్ ఎంపిక జరుగుతోంది . రోహిన్ వెంకటేషన్ దర్శకత్వం వహించే ఈ మూవీ త్వరలోనే షూటింగ్ కు వెళ్ళబోతోంది. మనుషులే దెయ్యాలను భయపెడితే అనే వెరైటీ కాన్సెప్ట్ తో వచ్చిన ఆనందో బ్రహ్మ అందులో ఉన్న హ్యుమర్ కంటెంట్ కి కమర్షియల్ గానూ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు తమిళ్ లో తమన్నా అంటే ఇంకాస్త గ్లామర్ తోడవుతుంది కాబట్టి మరో హిట్ కి దారులు పడ్డట్టే