Begin typing your search above and press return to search.

తమన్నా కావాలంటున్న చైతూ?!

By:  Tupaki Desk   |   24 Jun 2015 7:30 AM GMT
తమన్నా కావాలంటున్న చైతూ?!
X
అయితే సమంత, లేదంటే తమన్నా. ఈ ఇద్దరితోనే ఆడిపాడటానికి నాగచైతన్య మొగ్గు చూపుతున్నాడు. చైతూ నటించనున్న కొత్త సినిమాలో తమన్నా ఎంపికయ్యే అవకాశాలున్నాయని సమాచారం. 'కార్తికేయ' ఫేమ్‌ చందు మొండేటి దర్శకుడిగా నాగచైతన్య సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గౌతమ్‌మీనన్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమా హడావుడిలో ఉన్నాడు చైతూ. ఆ చిత్రం పూర్తి కాగానే చందు మొండేటి చేయనున్న సినిమా మొదలవుతుంది. ప్రస్తుతం అందులో కథానాయిక ఎంపిక గురించి కసరత్తులు సాగుతున్నాయి.

స్టార్‌ హీరోల సినిమాల్లో హీరోయిన్ల ఎంపిక హీరోల అభిప్రాయం మేరకే ఉంటుంది. అలా నాగచైతన్య తమన్నాకే ఓటేశాడట. దీంతో ఇప్పటికే హిట్‌ పెయిర్‌గా ముద్ర పడ్డ వీళ్లు మరోసారి సందడి చేయబోతున్నారని తెలుస్తోంది. చందు మొండేటి 'కార్తికేయ' తర్వాత బాగా సమయం తీసుకొని చైతూ సినిమా స్క్రిప్టును సిద్ధం చేశాడు. స్వతహాగా ఆయనలో మంచి రచయిత కూడా ఉన్నాడు. సో... అటు కథ, ఇటు మాటలు అదిరిపోతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.