Begin typing your search above and press return to search.

సూర్పణఖలా నటించాలనుంది -తమన్నా

By:  Tupaki Desk   |   5 July 2015 3:00 PM IST
సూర్పణఖలా నటించాలనుంది -తమన్నా
X
బాహుబలిలో అవంతిక పాత్రలో నటించింది మిల్కీ. అయితే ఈ పాత్ర గురించి మరీ అంత ఎక్కువ సమాచారం లేదు. అవంతిక ఓ రాకుమారి. కత్తి ఝలిపించి శత్రువుపై యుద్ధం చేస్తుంది. వీరత్వం నిరూపించుకుంటుంది అని మాత్రం తెలిసింది. ఇంకా తెలుసుకోవాల్సిన సంగతులు చాలానే ఉన్నాయని చెబుతూనే మిల్కీ ఇలా చెప్పింది.

=నేను ప్రిన్సెస్‌ని. వారియర్‌గా కనపిస్తా. ఫ్రెష్‌ కథాంశంలో చాలా కొత్తగా ఉండే పాత్ర ఇది. నా క్యారెక్టర్‌ గురించి అంతగా ప్రచారం కాలేదు కాబట్టి తెరపై చూసినప్పుడు సర్‌ప్రైజ్‌గా ఉంటుంది.

=రాజమౌళి లెజెండరీ దర్శకుడు. ఏదైనా సినిమా చేసేప్పుడు పక్కా ప్రణాళితో ఉంటారాయన. ఇలాంటి భారీ చిత్రానికి ముందే ప్రాక్టికల్‌గా మాక్‌ షూట్స్‌ చేశారు. ప్రణాళికా బద్ధంగా రెండు రోజుల ముందే నటీనటుల చేత ప్రాక్టీస్‌ చేయించేవారు.

=కెరీర్‌లో ఆవారా, 100పర్సంట్‌ లవ్‌ చిత్రాలతో పేరొచ్చింది. బాహుబలితో ప్రపంచమంతా టాక్‌ వస్తుంది.

=బాహుబలిలో ఏడు ప్రధాన పాత్రలున్నాయి. అందులో నా క్యారెక్టర్‌ పరిధి పెద్దగానే ఉంటుంది. తొలిభాగం కంటే రెండో భాగంలో కొంత తక్కువ కనిపిస్తాను.

=నాకు నెగెటివ్‌ క్యారెక్టర్లంటే ఇష్టం. తమిళ్‌లో ఆ తరహా ఓ క్యారెక్టర్‌ చేస్తున్నా. అలాగే బెంగాళ్‌ టైగర్‌తో పాటు కార్తీ, నాగ్‌ సినిమాలో నటిస్తున్నా.