Begin typing your search above and press return to search.
అక్కడ తమన్నానే గెలిచింది
By: Tupaki Desk | 10 Oct 2016 1:00 PM ISTమన దసరా సినిమాల సంగతేంటో తేలిపోయింది. ప్రేమమ్ మూవీ అదిరిపోయే వసూళ్లతో దూసుకెళ్తూ దసరాకు క్లియర్ విన్నర్ గా నిలిచింది. మిగతా సినిమాలూ నాలుగూ అంతంతమాత్రంగానే నడుస్తున్నాయి. తమన్నా-ప్రభుదేవాల ‘అభినేత్రి’ ఓ మోస్తరుగా ఆడుతోందంతే. ఐతే ఇక్కడ పెద్దగా ప్రభావం చూపించని ఈ సినిమా తమిళంలో మాత్రం అదరగొడుతోంది. అక్కడ దసరా విజేత ‘అభినేత్రి’ తమిళ వెర్షన్ ‘దేవి’నే కావడం విశేషం.
తెలుగులో పోటీ ఎక్కువ. పైగా ‘ప్రేమమ్’ చాలా మంచి టాక్ తెచ్చుకుని ప్రేక్షకుల్ని లాగేస్తోంది. కానీ తమిళంలో మూడు సినిమాలు రిలీజైతే.. వాటిలో ఎక్కువ పాజిటివ్ టాక్ ‘దేవి’కే వచ్చింది. మిగతా రెండు సినిమాలకూ నెగెటివ్ టాక్ రావడం తమన్నా-ప్రభుదేవా సినిమాకు కలిసొచ్చింది. శివ కార్తికేయన్ సినిమా ‘రెమో’.. విజయ్ సేతుపతి మూవీ ‘రెక్క’ రెండూ కూడా అంచనాల్ని అందుకోవడం విఫలమయ్యాయి. అదే సమయంలో ‘దేవి’ మీద అంచనాలు తక్కువే పెట్టుకున్నారు తమిళ ప్రేక్షకులు. ఐతే ఆ సినిమా వాళ్లను సంతృప్తి పరిచింది.
ప్రభుదేవా చాన్నాళ్ల తర్వాత తమిళంలో నటించడం.. అది కామెడీ టైమింగ్.. డ్యాన్సులు అదిరిపోవడం.. తమన్నా అందం.. అభినయంతో ఆకట్టుకోవడంతో తమిళ ప్రేక్షకులు శాటిస్ఫై అయిపోయారు. దర్శకుడు ఎ.ఎల్.విజయ్ కు అక్కడ మంచి ఇమేజ్ ఉండటం కూడా కలిసొచ్చింది. మన దగ్గర ఈ సినిమాకు యావరేజ్ రివ్యూలు వస్తే.. తమిళంలో మాత్రం ఫుల్ పాజిటివ్ సమీక్షలు ఇచ్చారు. కలెక్షన్లు కూడా చాలా బాగున్నాయి. మొత్తానికి తెలుగు.. హిందీ భాషల్లో యావరేజ్ అంటున్న సినిమా తమిళంలో మాత్రం సూపర్ హిట్ రేంజికి వెళ్లేలా ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/