Begin typing your search above and press return to search.

తమ్ము డిమాండ్ అంత ఉందా ?

By:  Tupaki Desk   |   7 March 2019 6:14 AM GMT
తమ్ము డిమాండ్ అంత ఉందా ?
X
యాంకర్ ఓంకార్ కు దర్శకుడిగా మంచి గుర్తింపు ఇచ్చిన సినిమా రాజు గారి గది. మొదటి భాగం అందరూ చిన్న యాక్టర్స్ తో తీసినా అది సంచలన విజయం సాధించి హానర్ జానర్ లో కొత్త ట్రెండ్ సృష్టించింది. దాని ఫలితం చూసాకే రెండో భాగానికి ఏకంగా కింగ్ నాగార్జునతో పాటు హీరోయిన్ సమంతా కూడా వచ్చి చేరింది. భారీ హిట్ కాదు కానీ పెట్టిన బడ్జెట్ కి రీజనబుల్ రిటర్న్స్ రాబట్టుకుని సేఫ్ గా నిలిచింది.

ఆ టైంలోనే రాజు గారి గది 3 తీస్తానని ప్రకటించిన ఓంకార్ ఇప్పుడు ఆ ప్రయత్నాలు సీరియస్ గా మొదలుపెట్టాడట. సెకండ్ పార్ట్ నుంచి స్టార్ వేల్యూ తోడయ్యింది కాబట్టి ఇప్పుడు చిన్న ఆర్టిస్టులతో తీస్తే వర్క్ అవుట్ కాదు. మార్కెటింగ్ చేయడం కూడా కష్టం. అందుకే ఈసారి మిల్కీ బ్యూటీ తమన్నాను అడిగినట్టు సమాచారం

అయితే కథ నచ్చిన తమన్నా రెమ్యునరేషన్ ఏకంగా కోటిన్నర అడిగిందని ఫిలిం నగర్ అప్ డేట్. ఇంతకు ముందు 70 లక్షల దాకా పుచ్చుకున్న మిల్కీ బ్యూటీకి ఎఫ్2 ఇండస్ట్రీ హిట్ వల్ల మరోసారి మార్కెట్ ఏర్పడింది. దానికి తోడు చిరంజీవి సైరా కూడా చేస్తుండటంతో దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకునే పనిలో పడింది. ఓంకార్ కథ డిమాండ్ చేస్తోంది కాబట్టి అంత మొత్తానికి ఓకే అంటున్నాడట.

గోపిచంద్ సరసన వేరే ఆఫర్ కు సైతం తమన్నా ఇంతే అడిగిందని మరో న్యూస్. ఇలాంటివి అధికారికంగా తెలిసేవి కాదు కాబట్టి గాసిప్స్ రూపంలో వచ్చినా నిప్పు లేనిదే పొగ రాదనే సామెత కోణంలో నమ్మేలాగే ఉంటాయి. మొత్తానికి తమన్నా డిమాండ్ మరోసారి ఎగబాకినట్టే కనిపిస్తోంది.