Begin typing your search above and press return to search.

తమన్నా పిలిచి కూల్ చేసిందంట!

By:  Tupaki Desk   |   21 Sept 2015 9:00 PM IST
తమన్నా పిలిచి కూల్ చేసిందంట!
X
ఆనంద్ అలియాస్ నందూ.. అదేనండీ 100%లవ్ సినిమాలో... చైతు - తమ్మూ కలిసి బకరాని చేసేస్తారే.. అతనే నందు. ఇతగాడు తర్వాత హీరో కూడా అయిపోయాడు కదా. ఇప్పటివరకూ దాదాపు 20సినిమాల్లో నటించేశాడు. పలు చిన్న - మీడియం బడ్జెట్ సినిమాల్లో లీడ్ కేరక్టర్స్ చేస్తున్న నందు.. సింగర్ గీతామాధురి భర్త కూడా. సినిమాల్లో నటించడం.. కనిపించినంద ఈజీ కాదని చెబ్తున్నాడు. ముఖ్యంగా 100 పర్సెంట్ లవ్ సినిమా చేస్తున్నపుడు... సుకుమార్ స్టైల్ చూసి దడ పుట్టేసిందట.

నోట మాట కూడా రాని పరిస్థితి తలెత్తిందట నందూకి. అఫ్పుడు మిల్కీ బ్యూటీ ఇతగాడిని పక్కకి తీసుకెళ్లి స్పెషల్ క్లాస్ తీసుకుందట. అంత పెద్ద హీరోయిన్ అంత సౌమ్యంగా, స్వీట్ గా హితోపదేశం చేస్తుంటే.. భగవద్గీత విన్నట్లుగా విన్నాడట. ఈ దెబ్బకి జడుపు తగ్గిపోయి.. మూవీ అంతా రిలాక్స్ డ్ గా - జోష్ తో పనిచేశానంటున్నాడు నందు. మరిన్ని సందర్భాల్లోనూ భామలు తర్వాత బాధల గురించి చెప్పుకున్నాడు నందు.

టెక్నీషియన్స్ బంద్ చేస్తున్న సమయం అది. ఆసమయంలో 365 డేస్ సినిమా కోసం రొమాంటిక్ సీన్ తీస్తున్నపుడు.. అందరూ ఒక్కసారిగా దాడి చేసేపాటికి.. ఇతగాడికి మైండ్ బ్లాంక్ అయిపోయిందంటున్నాడు. తమిళ్ సినిమా ఇదయం తిరైరంగం సినిమా చేస్తున్నపుడు.. హీరోయిన్ శ్వేత బైక్ తోలితే హీరో నందు వెనకాల కూర్చునే సీన్ తీశారు. షూటింగ్ అయిపోతున్న సమయంలో చెట్టుకు తీసుకెళ్లి గుద్దేసిందట శ్వేత. చూస్తుంటే.. కుర్రహీరోని భామలందరూ బాధలు పెడితే... ఒక్క తమ్మూ మాత్రం పని కట్టుకుని బాధ తీర్చినట్లుంది కదూ.