Begin typing your search above and press return to search.

తండ్రితోనూ రచ్చకు రెడీ!

By:  Tupaki Desk   |   27 Sept 2018 9:46 AM IST
తండ్రితోనూ రచ్చకు రెడీ!
X
మిల్కీ బ్యూటీ తమన్నా ఈ తరం యువ స్టార్‌ హీరోలందరితో దాదాపుగా నటించేసింది. మెగా హీరోల్లో రామ్‌ చరణ్‌ - పవన్‌ - అల్లు అర్జున్‌ తో నటించిన ఈ అమ్మడు త్వరలో మెగాస్టార్‌ చిరంజీవితో కూడా రొమాన్స్‌ కు సిద్దం అవుతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’లో ఒక కీలక పాత్రలో తమన్నా నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ చిత్రంలో చిరంజీవి - తమన్నాకు మద్య కొన్ని సీన్స్‌ ఉంటాయి - కాని అది హీరో - హీరోయిన్‌ తరహా సీన్స్‌ కావు. సైరా చిత్రంలో నటించే అవకాశం రావడంతో ఎంతో ఆనందంగా ఉన్న తమన్నాకు మరో బంపర్‌ ఆఫర్‌.

చిరంజీవి 152వ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. వరుస చిత్రాలతో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ ను అందుకుంటూ వస్తున్న కొరటాల శివ మొన్నటి సమ్మర్‌ లో ‘భరత్‌ అనే నేను’ చిత్రంతో ఇండస్ట్రీ టాప్‌ సక్సెస్‌ ను దక్కించుకున్నాడు. ఇలాంటి సమయంలో కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి సినిమా అంటే అంచనాలు పీక్స్‌ లో ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా కొరటాల శివ ఒక అద్బుతమైన సోషల్‌ మెసేజ్‌ ఉన్న ఒక కథను సిద్దం చేసినట్లుగా తెలుస్తోంది. ఆ చిత్రం షూటింగ్‌ ను ఈ సంవత్సరం చివర్లోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ ప్రతిష్టాత్మక చిత్రం కోసం హీరోయిన్‌ గా తమన్నా పేరును కొరటాల పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. చిరంజీవి గతంలో తమన్నాతో హీరోయిన్‌ గా నటించాలని కోరుకుంటున్నాను అంటూ కామెంట్‌ చేసిన విషయం తెల్సిందే. అందుకే కొరటాల కూడా చిరంజీవి ఆసక్తి మేరకు తమన్నాతో చర్చలు జరుపుతున్నాడు. చిరంజీవితో సినిమా అంటే ఏ ఒక్కరు కూడా నో చెప్పరు. తమన్నా మాత్రం ఎలా చెబుతుంది. అందుకే ఈ చిత్రంలో తమన్నా దాదాపుగా ఖరారు అయినట్లే అంటూ మెగా ఫ్యాన్స్‌ లో టాక్‌ వినిపిస్తుంది. కొడుకు రామ్‌ చరణ్‌ తో ‘రచ్చ’ చేసిన తమన్నా ఇప్పుడు తండ్రి చిరంజీవితో రచ్చకు సిద్దం అవుతుందని సోషల్‌ మీడియాలో టాక్‌ వినిపిస్తుంది. వచ్చే ఏడాది చివర్లోనే చిరు 152వ చిత్రం విడుదల అయ్యేలా కొరటాల ప్లాన్‌ చేస్తున్నాడు.