Begin typing your search above and press return to search.
నమ్మండి.. మిల్కీ చాలా బిజీ
By: Tupaki Desk | 7 Jan 2018 9:00 AM ISTమిల్కీ బ్యూటీ అని తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న తమన్నా అతికొద్ది కాలంలోనే స్టార్ హీరోలతో అవకాశాలను అందుకుంది. మొదట్లో కాస్త తడబడినా ఆ తరువాత వరుస విజయాలను అందుకొని స్టార్ హీరోలతో అవకాశాలను అందుకుంది. కానీ గత కొంత కాలం నుంచి అమ్మడు అపజయాలతో చాలా సతమతమైంది. కంటిన్యూగా ఫెయిల్యూర్స్ అందుతుండడంతో ఒకానొక సమయంలో ఐరెన్ లెగ్ అనే ముద్రను కూడా దక్కించుకుంది.
కానీ అందంలో మిల్కీ బ్యూటీ ఏ మాత్రం తేడా రానివ్వలేదు. దీంతో ఓ వర్గం ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తూ లేటెస్ట్ కుర్ర హీరోయిన్స్ కు గట్టి పోటీని ఇస్తోంది. ఇక ఆఫర్స్ ను కూడా తన రేంజ్ వరకు బాగానే అందుకుంటోంది. స్పెషల్ సాంగ్స్ తో స్పెషల్ రెమ్యునరేషన్స్ కూడా అందుతున్నాయి. ప్రస్తుతం తెలుగులో తమన్నా మూడు సినిమాలతో బిజీగా ఉంది. సందీప్ కిషన్ కొత్త సినిమాతో పాటు బాలీవుడ్ క్వీన్ రీమేక్ లో కూడా నటిస్తోంది. ఇక కళ్యాణ్ రామ్ సినిమాలో కూడా తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది.
అయితే తమన్నా ఆ సినిమాలో రేడియో జాకీగా కనిపించనుందట. కూల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండే ఆ కథలో అమ్మడి పాత్ర అందరికి నచ్చుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. కళ్యాణ్ రామ్ కూడా చాలా కొత్తగా కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక సిద్దార్థ్ తో 180 మూవీ తీసిన యాడ్స్ ఫిల్మ్ డైరెక్టర్ జయేంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ఫెమస్ కెమెరామెన్ పిసి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు