Begin typing your search above and press return to search.

నేను బతికిన విషయం కాకుండా బరువు పెరిగిన విషయం వారికి ముఖ్యం

By:  Tupaki Desk   |   12 Nov 2020 11:23 PM IST
నేను బతికిన విషయం కాకుండా బరువు పెరిగిన విషయం వారికి ముఖ్యం
X
మిల్కీ బ్యూటీ తమన్నా కరోనాను జయించింది. ఆమె కరోనా నిర్థారణ అయిన వెంటనే ప్రముఖ ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్‌ కు జాయిన్‌ అయ్యిందట. ఆ సమయంలో ఆమె తీసుకున్న ట్రీట్‌ మెంట్‌ చాలా కఠినంగా ఉండేదట. ఇక కరోనా లక్షణాలు తనలో అన్ని కనిపించాయి. ఒకానొక సమయంలో నేను చనిపోతానా అనే భయం కూడా కలిగింది. నాలో ఆత్మ విశ్వాసం కలిగించి వైధ్యలు నన్ను మామూలు మనిషిని చేశారంటూ ఎమోషనల్‌ అయ్యింది. ఈసమయంలో కొందరు తమన్నా బరువును గురించి కామెంట్స్‌ చేస్తున్నారు.

కరోనాతో నేను చనిపోతాను అనుకున్నాను. అలాంటి నేను బతికాను. ఆ విషయాన్ని చాలా మంది అర్థం చేసుకోవడం లేదు. కరోనాతో నేను పడ్డ బాధలు ఎవరికి తెలియవు. కాని నేను కరోనా సమయంలో వాడిన మందులు డైట్‌ వల్ల కాస్త బరువు పెరగడంతో అంతా కూడా లావు అయ్యారు కదా అంటూ ట్రోల్స్‌ చేస్తున్నారు. ఆ సమయంలో నా మానసిక పరిస్థితి ఇప్పుడు ఎవరికి అక్కర్లేదు.

నేను బతికిన విషయం కంటే నా బరువు పెరిగిన విషయం కొందరికి ముఖ్యం అయ్యిందని తమన్నా ఆవేదన వ్యక్తం చేసింది. తమన్నా ఆహా ద్వారా 11త్‌ అవర్‌ వెబ్‌ సిరీస్‌ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. మరో వైపు సిటీ మార్‌ సినిమాలో గోపీచంద్‌ కు జోడీగా నటించింది. సినిమాల్లో పెద్దగా ఆఫర్లు రాని తమన్నా మెల్లగా ఓటీటీ బాట పట్టింది.