Begin typing your search above and press return to search.

తమ్మూ.. ఇలా చూసి తట్టుకోలేరమ్మా

By:  Tupaki Desk   |   4 Jun 2016 9:37 AM GMT
తమ్మూ.. ఇలా చూసి తట్టుకోలేరమ్మా
X
తమన్నా అంటే గ్లామర్ క్వీన్. కెరీర్ లో ఎక్కువగా గ్లామర్ పాత్రలే చేసింది. తమిళంలో ఒకటీ అరా డీగ్లామర్ రోల్స్ చేసింది కానీ.. అవి ఆమెకు సూటవ్వలేదు. అలాంటమ్మాయి ముసలివాళ్లు కట్టుకుని పసుపు రంగు కాటన్ చీర.. లూజుగా ఉన్న పచ్చరంగు రవిక.. జడ నిండా మల్లెపులూ.. చేతికి గాజులు.. నుదుటున పెద్ద బొట్టు పెట్టుకుని వస్తే చూసేవాళ్లకు ఎలా ఉంటుంది..? నిన్న ‘అభినేత్రి’ టీజర్ రిలీజ్ కార్యక్రమానికి ఇలాగే తయారై వచ్చింది తమ్మూ. ఆమెను చూసి ‘అభినేత్రి’ యూనిట్ సభ్యులే ఆశ్చర్యపోయారు. ఇక మీడియా వాళ్ల సంగతి ఏమని చెప్పాలి..?

‘అభినేత్రి’ సినిమాలో తన లుక్ ఎలా ఉండబోతోందో ఇది శాంపిల్ అంటోంది తమ్మూ. ఈ సినిమాలో తమ్మూ ఓ షాకింగ్ రోల్ లో దర్శనమిస్తుందట. డీగ్లామరస్ గా కనిపిస్తుందట.మరి ఆమెను అలా చూసి కుర్రకారు ఎలా తట్టుకుంటుందో చూడాలి. నిన్న రిలీజైన టీజర్లో తమన్నా కనిపించలేదు. త్వరలో ఆమె క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ స్పెషల్ టీజర్ రిలీజ్ చేస్తారట. అందులో తన లుక్ చూసి ఆశ్చర్యపోకుండా ముందే జనాల్ని ప్రిపేర్ చేయడానికి ఇలా తయారై వచ్చినట్లుంది తమ్మూ. ‘నాన్న’ ఫేమ్ ఎ.ఎల్.విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభుదేవా తమ్మూకు జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఈ చిత్రాన్ని కోన వెంకట్ తన కేఎఫ్సీ బేనర్ మీద రిలీజ్ చేస్తున్నాడు.​