Begin typing your search above and press return to search.

తమన్నాడ్రీమ్‌ రోల్‌.. మీకు అర్థమవుతుందా?

By:  Tupaki Desk   |   27 Jan 2020 4:51 AM GMT
తమన్నాడ్రీమ్‌ రోల్‌.. మీకు అర్థమవుతుందా?
X
హ్యాపీడేస్‌ చిత్రం తర్వాత వెనక్కు తిరిగి చూసుకోకుండా కెరీర్‌ లో దాదాపు పది సంవత్సరాలు స్టార్‌ హీరోయిన్‌ గా వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ మిల్కీబ్యూటీ తమన్నా. ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగు మరియు తమిళంలో అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. గతంలో ఈ అమ్మడికి డేట్లు ఖాళీ ఉండేవి కాదు. కాని ఇప్పుడు ఛాన్స్‌ ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. కెరీర్‌ చివరి దశలో ఈమె ఉన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యంగ్‌ స్టార్‌ హీరోలు.. కొత్త హీరోలకు ఈమె ఔట్‌ డేటెడ్‌ అయ్యింది. అందుకే ఈమె కొత్త రూట్‌ ను ఎంపిక చేసుకుంటుంది.

లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపుతోంది. ఆ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పటి వరకు తాను ఎన్నో పాత్రలు చేశాను. నా కెరీర్‌ పట్ల సంతృప్తిగా ఉన్నాను. కాని నా డ్రీమ్‌ రోల్‌ మాత్రం అలాగే ఉండి పోయింది అంది. నాకు మ్యూజికల్‌ సినిమాలో డాన్స్‌ ప్రథానమైన పాత్రను చేయాలనే కోరికగా ఉంది. అలాంటి పాత్ర చేయడం నా డ్రీమ్‌ అంటూ చెప్పుకొచ్చింది. అలాంటి పాత్రలు.. కాన్సెప్ట్‌ లు ఏమైనా ఉంటే నన్ను సంప్రదించండి అంటూ ఇండైరెక్ట్‌ గా మిల్కీ బ్యూటీ దర్శకులను కోరుతుంది.

టాలీవుడ్‌ లో ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్‌ లో మంచి డాన్సర్స్‌ జాబితా తీస్తే అందులో ఖచ్చితంగా తమన్నా పేరు ఉంటుంది. పలువురు హీరోలతో సమానంగా డాన్స్‌ లు వేసి వారిని మెప్పించిన తమన్నా ఇప్పుడు డాన్స్‌ ప్రాధాన్యత ఉన్న సినిమా చేయాలని ఆశ పడుతుంది. మరి దర్శకులారా మీకు అర్థం అవుతుందా.. ఆమె కోసం డాన్స్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో కథను సిద్దం చేస్తే వెంటనే ఒప్పుకుంటుంది. మరెందుకు ఆలస్యం మిల్కీ బ్యూటీ కోసం కథను సిద్దం చేయండి మరి.