Begin typing your search above and press return to search.

న‌యా సౌత్ క్వీన్స్ నూటికి నూరు శాతం ఫెయిల్

By:  Tupaki Desk   |   15 Sep 2020 2:30 AM GMT
న‌యా సౌత్ క్వీన్స్ నూటికి నూరు శాతం ఫెయిల్
X
కంగ‌న ర‌నౌత్ న‌టించిన `క్వీన్‌` బాలీవుడ్ ‌లో సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించ‌డ‌మే కాకుండా కంగ‌న‌ని జాతీయ స్థాయి ఉత్త‌మ న‌టిగా నిల‌బెట్టింది. క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ తో పాటు కంగ‌న న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంసలు ద‌క్కాయి. ఇదే చిత్రాన్ని నాలుగు భాష‌ల్లో రీమేక్ చేశారు. తెలుగు రీమేక్ ‌లో త‌మ‌న్నా.. త‌మిళ రీమేక్ ‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించారు. సౌత్ లో రీమేక్ అయిన చిత్రాల్లో అత్యంత డిలే అయిన సినిమాలు ఇవే కావ‌డంతో ఆల్మోస్ట్ అంతా మ‌ర్చిపోయే ప‌రిస్థితి.

తెలుగులో త‌మ‌న్నా హీరోయిన్ గా `ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి` పేరుతో రీమేక్ అయింది. ఇక త‌మిళంలో కాజ‌ల్ తో `పారిస్ పారిస్‌` గా రీమేక్ చేశారు. ఇన్నాళ్లు వీటిని థియేట్రిక‌ల్ రిలీజ్ కోసం ఆపారు కానీ ప‌న‌వ్వ‌లేదు. త్వ‌ర‌లో ఈ రీమేక్ ల‌ని ఓటీటీలో రిలీజ్ చేయ‌బోతున్నారు. ఇందు కోసం మేక‌ర్స్ ప్రమోష‌న్ ప్రారంభించారు. ఇందులో భాగంగా వీడియో సాంగ్స్ ని రిలీజ్ చేశారు. అయితే కంగ‌న‌ని రిప్ర‌జెంట్ చేయ‌డంలో త‌మ‌న్నా.. కాజ‌ల్ నూటికి నూరు శాతం ఫెయిల్ అయిన‌ట్టుగా తెలుస్తోంది.

`క్వీన్‌`లో కంగ‌న ఇన్నోసెంట్ ఢిల్లీ యువ‌తి పారిస్ వెళ్లి ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంది అన్న కోణంలో రూపందించారు. అయితే ఈ పాత్ర‌కు ప్రాణ ప్ర‌తిష్ట చేయ‌డంలో స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ వున్న త‌మ‌న్నా.. కాజ‌ల్ దారుణంగా ఫెయిల్ అయ్యార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. కాస్ట్యూమ్స్ విష‌యంలోనూ.. డీ గ్లామ‌ర్ క్యారెక్ట‌ర్ లోనూ ఆక‌ట్టుకోలేక‌పోయారు. దీంతో ఈ రీమేక్స్ ‌కి సంబంధించిన వీడియో సాంగ్స్ కి యూట్యూబ్ లో వ్యూస్ దారుణంగా ప‌డిపోయాయి. దీనిని బ‌ట్టి వీళ్ల‌ ప‌రిస్థితి ఎలా వుంద‌నేది అర్థం చేసుకోవ‌చ్చు.