Begin typing your search above and press return to search.
హీరోయిన్లు ఏం పాపం చేశారయ్యా!
By: Tupaki Desk | 12 July 2015 9:20 AM ISTబాహుబలి ఓ విజువల్ వండర్. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రతి తెలుగు ప్రేక్షకుడూ ఈ సినిమాను చూసి తీరాల్సిందే. ఐతే అలాగని సినిమాలో మైనస్‌లే లేవనుకోవడానికి లేదు. కథనం విషయంలో లోపాలున్న మాట వాస్తవం. రాజమౌళి గత సినిమాల్లో ఉన్నంత బిగి లేదన్నది మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయం. ఇక ఎక్కువమంది చెబుతున్న మరో మైనస్.. హీరోయిన్లు. శివుడిగా, బాహుబలిగా ప్రభాస్ స్క్రీన్ మొత్తాన్ని ఆక్రమించేయగా.. భల్లాలదేవగా రానాకు కూడా మంచి ప్రాధాన్యమే దక్కింది. ఇంకా రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్‌ల క్యారెక్టర్లు కూడా అదిరిపోయాయి. కానీ హీరోయిన్ల విషయంలో మాత్రం జక్కన్న శీతకన్నే వేశాడు.
అనుష్క క్యారెక్టర్‌కు ఫస్ట్ పార్ట్‌లో పెద్దగా ప్రాధాన్యం ఉండదని రాజమౌళి ముందు నుంచి చెబుతూనే ఉన్నాడు. కానీ ఉన్న పావుగంట కూడా అనుష్క క్యారెక్టర్ భరించలేనట్లు ఉంది. ఎంత పాతికేళ్లు కారాగారంలో మగ్గుతున్నప్పటికీ ఆమెను మరీ అంత ఘోరంగా చూపించాలా అన్నది ప్రేక్షకుల సందేహం. ఆ మేకప్ భరించలేనట్లుగా ఉంది. సహజంగా లేదు. తారు తీసి ముఖానికి రాసినట్లు అలా చూపించడం బాగా లేదనిపించింది. ఇక తమన్నా విషయానికొస్తే.. ఆమెకు మొదట్లో భారీ బిల్డప్ ఇచ్చారు. తర్వాత ఆ క్యారెక్టర్‌ను తేల్చేశారు. వీరనారిగా తమన్నా ఆకట్టుకోలేకపోయింది. తప్పు తమన్నాలో ఉందో.. రాజమౌళిలో ఉందో కానీ.. ఆమె బాడీ లాంగ్వేజ్ ఏమంత బాగాలేదు. ఆమెలో వీరత్వం ఏ కోశానా కనిపించలేదు. ఐతే గ్లామర్ పాయింట్‌లో మాత్రం తమన్నా ఆకట్టుకుంది. కానీ ఆ పార్ట్ ఎంతోసేపు లేదు. మొత్తానికి బాహుబలిలో ఆకర్షణలు చాలా ఉన్నప్పటికీ హీరోయిన్ల విషయంలో మాత్రం నిరాశ తప్పలేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.